అమరావతి మాయమైపోతుందా? ప్రభుత్వం డిసైడ్ అయిందా?
అమరావతిలో శాసన రాజధానిని కూడా తీసివేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక్కడ కేవలం గ్రీన్ కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి లో శాసన రాజధానిని [more]
అమరావతిలో శాసన రాజధానిని కూడా తీసివేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక్కడ కేవలం గ్రీన్ కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి లో శాసన రాజధానిని [more]
అమరావతిలో శాసన రాజధానిని కూడా తీసివేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక్కడ కేవలం గ్రీన్ కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి లో శాసన రాజధానిని కూడా ఉంచడానికి వైసీపీ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని చికాకు పెట్టే విధంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటం, సవాళ్లు విసరడం వంటి వాటిపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
మూడు ప్రాంతాలకు మూడు…..
పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతిలో శాసనరాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టాన్ని కూడా తెచ్చింది. శాననసభ, శాసనమండలిలో ఆమోదం పొందినట్లుగా భావించి గవర్నర్ సయితం దీనిపై ఆర్డినెన్స్ జారీ చేశారు. సీఆర్డీఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నాని ప్రకటనను….
కానీ తాజాగా మంత్రి కొడాలి నాని ప్రకటన చూస్తే శాసన రాజధానిని కూడా అమరావతిలో ఉంచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో కూడా చర్చించామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామని జగన్ స్పష్టం చేశారన్నారు. మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి ఈ ప్రకటన వచ్చిందంటే అంత ఆషామాషీగా తీసుకోలేం. దీనిని ఒక మంత్రి అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకోలేం. పైగా కమ్మ సామాజికవర్గం నేతగా ఉన్న కొడాలి నాని నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
మైండ్ గేమ్ మాత్రమేనా?
గత 266 రోజులుగా అమరావతిలో రైతులు దీక్షలు చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రైతులు న్యాయపోరాటానికి కూడా దిగారు. అయితే మైండ్ గేమ్ లో భాగంగా కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న చర్చ కూడా జరగుతుంది. రైతుల పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపిస్తుండటం, పదేపదే కేసులతో చికాకులు తెప్పిస్తుండటంతో అసలు శాసన రాజధాని కూడా ఉండవద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్లర్లు వదిలారు. దీంతోనైనా రైతులు దిగివస్తారని భావించి ప్రభుత్వం కొడాలి నానితో ఈ వ్యాఖ్యలు చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొడాలి నాని ఈ డిమాండ్ ఏ టర్న్ తీసుకుటుందో చూడాలి.