కేటీఆర్ వల్ల కూడా కావడం లేదటగా

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో వ‌ర్గ పోరు తార‌స్థాయికి చేరింది. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వయలోపం, ఆధిప‌త్య ధోర‌ణులు పెరుగుతున్నాయి. దీంతో నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే [more]

Update: 2020-03-10 09:30 GMT

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో వ‌ర్గ పోరు తార‌స్థాయికి చేరింది. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వయలోపం, ఆధిప‌త్య ధోర‌ణులు పెరుగుతున్నాయి. దీంతో నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నా రు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ పార్టీ ప‌రిస్థితి, నాయ‌కుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. మంత్రులు -మంత్రుల‌కు మ‌ధ్య, మంత్రులు-ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య, సీనియ‌ర్లు- ఎమ్మెల్యేల‌కు మధ్య, ఓడిన‌వారు – మంత్రుల‌కు మ‌ధ్య ఇలా ర‌క‌ర‌కాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ నేత‌లు విభేదాల‌తో జుట్లు పీక్కుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ మంత్రి, కార్యనిర్వాహ‌క అధ్యక్షుడు కేటీఆర్ వీరితో చ‌ర్చించి ప‌రిష్కరించేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నా ఇవి ఆగ‌డం లేద‌ట‌.

వరంగ‌ల్: రాజ‌కీయ జిల్లాగా పేరున్న వ‌రంగల్‌లో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇద్దరూ కూడా తొలిసారి మంత్రులు అయిన‌వారే. అంతేకాదు, ఇద్దరూ కూడా పార్టీలు మారి టీఆర్ఎస్ గూటికి వ‌చ్చిన వారే. అయినా కూడా ఒక‌రిపై ఒక‌రు పైచేయి కోసం పాకులాడుతున్నారు. ఎర్రబెల్లి ములుగు, మహబూబాబాద్ జిల్లాల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని సత్యవతి రాథోడ్ అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం కేటీఆర్ దృష్టికి రాగానే రంగంలోకి దిగిన ఆయ‌న ములుగు, మహబూబాబాద్ జిల్లాలను సత్యవతీ రాథోడ్ కు వదిలేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా జిల్లాల మీద దృష్టి కేంద్రీకరించాలని ఎర్రబెల్లికి సూచించార‌ట‌.

క‌రీంన‌గ‌ర్‌: కీల‌క‌మైన క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని స‌మాచారం. నిజానికి ఈటెల చాలా సీనియ‌ర్ అయినా కూడా ఆయ‌న కూడా స‌మ‌న్వయం చేసుకోవ‌డం మానేసి ర‌గ‌డ‌కు దిగుతున్నార‌ని అంటున్నారు. ఇక ఇక్కడ కేసీఆర్ సైతం ఈటెల‌కు చెక్ పెట్టేందుకు గంగుల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌న్న టాక్ ఉంది. ఇప్పుడు వీరిద్దరి మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించార‌ట‌.

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా ప‌రిస్థితి ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నార‌ని స‌మాచారం. దీంతో ఇంద్రకరణ్ రెడ్డిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల‌పై మంత్రి కూడా ప‌ర‌స్పరం అసంతృప్తులు వ్యక్తం చేసుకుంటున్నారు. దీంతో కేటీఆర్ వీరిని కూడా సానుకూల ప‌రిచిన‌ట్టు తెలుస్తోంది.

ఖమ్మం: రాజ‌కీయ ఖిల్లా ఖ‌మ్మం టీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు మూడు వ‌ర్గాలు మారి ఆధిప‌త్య పోరును ఉధృతం చేశార‌ట‌. దీంతో ఇక్కడ కూడా ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఎవ‌రికి వారే సీనియ‌ర్లు కావ‌డం, ఎవ‌రికి వారికి అనుచ‌రులు ఉండ‌డం కూడా వీరి ఆధిప‌త్యానికి ప‌రాకాష్టగా మారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News