గుడివాడను డామినేట్ చేస్తున్నాడే?
రాష్ట్ర ఐటీ రాజధానిగా ఇప్పటి వరకు ఉన్న, ఇకపై పాలనా రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి నానాటికీ [more]
రాష్ట్ర ఐటీ రాజధానిగా ఇప్పటి వరకు ఉన్న, ఇకపై పాలనా రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి నానాటికీ [more]
రాష్ట్ర ఐటీ రాజధానిగా ఇప్పటి వరకు ఉన్న, ఇకపై పాలనా రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి నానాటికీ పెరుగుతోంది. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ విశాఖ సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ విషయాన్ని పక్కన పెడుతున్న వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలు చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అధికార పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది.
ఇద్దరి మధ్య…..
ప్రధానంగా మంత్రి అవంతి శ్రీనివాస్ తన దూకుడు పెంచారు. పార్టీలో నేతల ను డామినేట్ చేసేలా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని దిగువ స్థాయి నేతలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఒక పక్క మంత్రిని ఇబ్బంది పెడుతున్నా, ఆయన వాటిని ఖాతరు చేయకుండా కీలకమైన నాయకులతో పోటా పోటీగా తలపడేందుకు, పార్టీలో ఆధిపత్యం సంపాయించుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ కు, మంత్రి అవంతికి మధ్య అస్సలు పడడం లేదని ప్రచారం జరుగుతోంది.
జగన్ కు సన్నిహితుడిగా….
అయితే, అవంతి శ్రీనివాస్ తీరును గమనిస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత సన్ని హితుడైన గుడివాడ అమర్నాథ్ పార్టీ పక్షాన బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. గతంలో ఆయన తండ్రి కూడా వైఎస్‌కు అత్యంత ఇష్టుడిగా ఉండేవారు. ఇప్పుడు ఇదే వారసత్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్టీ తరపున అమర్నాథ్ మంచి వాయిస్ వినిపిస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు, విశ్లేషణలకు పార్టీలోను, ప్రజల్లోనూ కూడా మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో ఈ పరిణామం అవంతికి కంటిపై కనుకు లేకుండా చేస్తోందని అంటున్నారు.
మంత్రి పదవిని…..
మరో రెండేళ్లలో రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి మం త్రివర్గంలో పోటీ ఇచ్చేవారితో గుడివాడ అమర్నాథ్ కీలకంగా కనిపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ కూడా బలమైన గళం వినిపిస్తున్నారని అంటున్నారు. దీంతో అవంతి శ్రీనివాస్ ఎక్కడికక్కడ గుడివాడ కు చెక్ పెడుతున్నారు. గుడివాడ అమర్ నాధ్ ఏదైనా అంశంపై ప్రెస్ మీట్ పెడితే.. ఆ వెంటనే ఓ గంట గ్యాప్‌లో అవంతి శ్రీనివాస్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అదేవిధంగా గుడివాడ ను డామినేట్ చేసేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వ్యతిరేకుల సంఖ్య…..
ఇక అవంతి శ్రీనివాస్ గతంలో అనకాపల్లి ఎంపీగా చేశారు. అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. అప్పటి నుంచే అవంతికి, ఇటు అమర్నాథ్‌కు పొసిగేది కాదు. ఇటు మంత్రికి ఎవ్వరితోనూ పడడం లేదు. అటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, విశాఖ అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, గుడివాడ చెప్పుకుంటూ పోతే మంత్రి వ్యతిరేకుల లిస్ట్ పెద్దదే. దీంతో వైజాగ్ వైసీపీలో జరుగుతోన్న పరిణామాలతో వైసీపీ కార్యకర్తల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరి ఇది ఎలా చక్కబడుతుందో చూడాలి.