ఈ ఎంపీపై అప్పుడే ఒత్తిళ్లా… వైసీపీలో రగడ ?
అధికారంలో లేని నేతలది ఒక బాధ.. అధికారంలో ఉన్నవారిది మరో ఆవేదన. అన్నట్టుగా ఉంది.. వైసీపీ పరిస్థితి. ప్రస్తుతం జోరు విజయాలపై ఉన్న వైసీపీ.. నేతల మధ్య [more]
అధికారంలో లేని నేతలది ఒక బాధ.. అధికారంలో ఉన్నవారిది మరో ఆవేదన. అన్నట్టుగా ఉంది.. వైసీపీ పరిస్థితి. ప్రస్తుతం జోరు విజయాలపై ఉన్న వైసీపీ.. నేతల మధ్య [more]
అధికారంలో లేని నేతలది ఒక బాధ.. అధికారంలో ఉన్నవారిది మరో ఆవేదన. అన్నట్టుగా ఉంది.. వైసీపీ పరిస్థితి. ప్రస్తుతం జోరు విజయాలపై ఉన్న వైసీపీ.. నేతల మధ్య ఆధిపత్య పోరు బాగానే సాగుతోంది. సీనియర్లు.. జూనియర్లపై పెత్తనం చేయడం.. వారిని తమ ఖాతాలో వేసుకుని.. ప్రచారం చేసుకోవడం… తాము పిలిస్తే వచ్చేలా వారిని మౌల్డ్ చేసుకోవడం సహజ పరిణామంగా మారిపోయింది. అయితే.. ఈ పరిస్థితి నుంచి కొందరు బయటపడినా.. ఇంకా చాలా మంది సీనియర్లు చెప్పినట్టే వింటున్నారు.. నడుస్తున్నారు.
జూనియర్ నేతలు…..
గత 2019 ఎన్నికల్లో సీఎం జగన్ జూనియర్ నేతలకు అవకాశాలు కల్పించారు. దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో జూనియర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల్లోని సీనియర్ నేతలు.. మంచి పలుకుబడి ఉన్న నాయకులు.. ముఖ్యంగా జగన్ దగ్గర నేరుగా చనువున్న నేతలు.. జూనియర్లపై ఆధిపత్యం చలాయిస్తున్న విషయం కొన్నాళ్లుగా వైసీపీలో చర్చనీయాంశంగా ఉంది. అయితే.. దీనిని కొన్నాళ్లు భరించినా.. చాలా మంది మాత్రం ఇటీవల కాలంలో ఈ ఆధిపత్య రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
గురుమూర్తి విషయంలోనూ…
ముఖ్యంగా వైసీపీలో ఇద్దరు, ముగ్గురు మంత్రుల ఆధిపత్యం చాలా మంది సహించలేకపోతున్నారు. వారు జగన్‌కు సన్నిహితంగా ఉంటామన్న బ్రాండ్ వాడుకుని రాష్ట్ర వ్యాప్తంగా సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కర్ర పెత్తనాలు చేస్తూ వారిని మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరి దెబ్బతో తలలు పండిన రాజకీయ నేతలే విలవిల్లాడుతున్నారు. ఇక కుర్రోళ్లు, జూనియర్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సీనియర్ మంత్రులు ఆదేశిస్తే వీళ్లు చేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఇక, ఇప్పుడు తిరుపతి ఎంపీగా ఎన్నికైన డాక్టర్ గురుమూర్తిపైనా.. సీనియర్లు ఇద్దరు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. నిజానికి సీఎం జగన్ నేరుగా ఎంపిక చేసిన అభ్యర్తి గురుమూర్తి. ఆయనకు ఎవరూ టికెట్ ఇప్పించలేదు. సిఫారసు కూడా చేయలేదు.
రెండు వర్గాలు…..
కానీ, చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ సీనియర్ నేతలు.. ఈయనపై ఒత్తిడి తెచ్చి.. తమ కోటరీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై ఏం చేయాలో తెలియక గురుమూర్తి తెల్లబోతున్నారని సమాచారం. ఇంకా ఎంపీగా ప్రమాణం కూడా చేయని గురుమూర్తిని ఇప్పటికిప్పుడు తమ కోటరీలో చేర్చుకునేందుకు నేతలు ప్రయత్నించడం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన్ను తమ వైపునకు తిప్పుకునేందుకు ఎవరికి వారు ఒత్తిడి చేస్తుండడంతో ఆయన ఆ ఇద్దరి మధ్య తీవ్రంగా నలిగిపోతున్నారన్న టాక్ ఇప్పుడు జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. మరి ఇది జగన్ వరకు చేరితే..ఏం జరుగుతుందనేది ఆసక్తిగా ఉంది.