ఈ ఇద్దరూ అదే పనిగా.. ఎందుకిలా?
ఇద్దరు మాజీ ఎంపీల దూకుడు వెనుక అసలు కారణమేంటి ? ఎవరున్నారు ? ఎందుకిలా జరుగుతోంది? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అమలాపురం మాజీ [more]
ఇద్దరు మాజీ ఎంపీల దూకుడు వెనుక అసలు కారణమేంటి ? ఎవరున్నారు ? ఎందుకిలా జరుగుతోంది? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అమలాపురం మాజీ [more]
ఇద్దరు మాజీ ఎంపీల దూకుడు వెనుక అసలు కారణమేంటి ? ఎవరున్నారు ? ఎందుకిలా జరుగుతోంది? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరిల వ్యవహారం ఇటీవల కాలంలో రాజకీయంగా చర్చకు వస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరు నాయకులు కూడా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇద్దరూ భిన్నమైన సామాజిక వర్గాలకు చెందిన వారే అయినప్పటికీ.. రాజకీయంగా చూస్తే.. జగన్‌పై చేస్తున్న విమర్శలు మాత్రం ఒకే తరహాలో ఉంటుండడం గమనార్హం.
జగన్ పై విమర్శలు చేస్తూ…..
సబ్బం హరి.. రాజధాని తరలింపు సహా.. ఎన్నికల కమిషనర్ వ్యవహారాలపై జగన్ సర్కారును తీవ్రంగా విమర్శించారు. ఇక, హర్ష కుమార్ తన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని, తమ వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట హర్షకుమార్‌పై పోలీసులు ఓ విషయంలో కేసు కూడా పెట్టారు. కొన్నాళ్లు ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, సబ్బం హరి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ.. తీవ్ర విమర్శలు మాత్రం చేస్తున్నారు. ప్రజల్లో వైఎస్సార్ సీపీ హవా పది శాతం తగ్గిపోయిందని, జగన్ నియంతగా మారిపోయారని హరి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
వైసీపీలో చేరి….
వాస్తవానికి ఈ ఇద్దరు నాయకులు కూడా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాజకీయంగా పుంజుకున్నారు. వైఎస్ చేతుల మీదుగానే టికెట్లు పొందారు. కానీ, జగన్‌పై మాత్రం విరుచుకు పడుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఇద్దరూ ఆదిలో వైఎస్సార్ సీపీలోనే చేరాలని అనుకున్నారు. గత ఏడాది ఎన్నికల ముందు హర్షకుమార్ అమలాపురం టికెట్ కోసం ప్రయత్నించారనే చర్చకూడా ఉంది. ఇలా వైఎస్‌తో సంబంధాలు ఉన్న నాయకులు ఇప్పుడు జగన్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు తిట్టిపోస్తున్నారు ? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
ఇద్దరి భాధ అదేనా?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఈ ఇద్దరు మాజీ ఎంపీల వార్తలను టీడీపీ అనుకూల మీడియా భారీ ఎత్తున కవర్ చేస్తోందనేది వాస్తవం. వారు ఏం మాట్లాడినా ప్రసారం చేయడం, మసాలా కలిపి వార్తలు ప్రచురించడం చేస్తోంది. అయితే, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరికి సరైన రాజకీయ వేదిక ఇప్పటి వరకు లభించలేదు. గత ఏడాది సబ్బం హరి టీడీపీలో చేరినా.. ఆయనకు పార్టీ నేతలకు మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. దీంతో పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హర్షకుమార్ ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. అయినప్పటికీ.. రెచ్చిపోతున్నారు. వీరి ఆవేదన అంతా.. వైఎస్సార్ సీపీలో లేకపోయామనేనా? లేక.. తమకు గుర్తింపు లభించడం లేదనే అక్కసా? అనే చర్చమాత్రం సశేషంగా మిగిలిపోయింది.