హర్ష ఇక ఆ పార్టీలో చేరిపోయినట్లేనా …?

మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ ఇక పూర్తిగా సైకిల్ ఎక్కినట్లేనా అనే చర్చ ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ గా మారింది. 2014 [more]

Update: 2020-07-31 00:30 GMT

మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ ఇక పూర్తిగా సైకిల్ ఎక్కినట్లేనా అనే చర్చ ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డి తో ప్రయాణించి ఆ తరువాత సమైక్యాంధ్ర పార్టీ వైఫల్యం తో హర్ష కుమార్ రాజకీయ భవిత అంధకారంలో పడిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ లో చేరతారని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. వైసిపి, జనసేన లకు షిఫ్ట్ అవుతారనుకున్నా ఆ పార్టీలనుంచి హర్ష కుమార్ కి ఆఫర్ దక్కలేదు. ఈ సమయంలో అధికారంలో ఉన్న టిడిపి ఆహ్వానం అందుకున్నారు హర్ష కుమార్.

కాకినాడ లో సైకిల్ ఎక్కి …

మూడు దశాబ్దాలకు పైగా తన కాంగ్రెస్ రాజకీయ జీవితంలో టిడిపి పై అలుపెరగని పోరాటం చేశారు హర్ష కుమార్. అయితే అనివార్య పరిస్థితుల్లో టిడిపి లోకి జంప్ ఇవ్వలిసి వచ్చింది. ఇక్కడ దాకా బాగానే ఉన్నా రెండు అంశాల్లో కోస్తా దళితుల్లో పట్టున్న హర్ష కు డ్యామేజ్ జరిగిపోయింది. చంద్రబాబు సమక్షంలో కాకినాడ సభలో 2019 ఎన్నికలకు ముందు సైకిలెక్కారు హర్ష కుమార్. ఈ సందర్భంగా అయన బాబు కి పాదాభివందనం చేయడం ఆయన అభిమానుల్లో అలజడి రేపింది. ఈ అంశాన్ని వైసిపి బాగా ప్రచారంలో పెట్టడంతో హర్ష హర్ట్ కుమార్ ఆత్మాభిమానం దెబ్బతింది. దీనికి తోడు అమలాపురం పార్లమెంట్ టికెట్ హర్ష కుమార్ కు ఇస్తానని చెప్పి బాలయోగి కుమారుడికి చివరి నిమిషంలో మార్పు చేయడం తో ఒక్కసారిగా పొలిటికల్ గా ఆయన బ్లాక్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో తన అభిమానులతో సమావేశం అయ్యి బాబు కాళ్ళు పట్టుకోవడం అన్న అంశంపై వివరణ ఇచ్చి ఉత్తరాది సంప్రదాయం ప్రకారం పెద్ద వాళ్ళ కాళ్లకు మొక్కడం తప్పేలా అవుతుందని సమర్ధించుకున్నారు. అదే విధంగా టిడిపి ని ఓడించాలని పిలుపునిచ్చి సైకిల్ దిగిపోయి సైలెంట్ అయిపోయారు.

జగన్ రాకతో ..

ఆ తరువాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం హర్ష కుమార్ దళిత ఉద్యమాలు ఆయనపై కేసులు చకచకా జరిగిపోయాయి. ఈ అవకాశాన్ని టిడిపి అందిపుచ్చుకుని దళితుల్లో పట్టున్న నేత పై వల విసిరింది. ఏదో ఒక పార్టీ అండ ఉండటం మంచిదే అన్న ఆలోచనతో ఇప్పుడు మరోసారి స్పీడ్ అయ్యారు హర్ష కుమార్. ఆయనకు ఇటీవల దళితుడి శిరోముండనం, దళిత బాలిక పై అత్యాచారం వంటివి ఆయుధాలుగా దొరికాయి. వీటిని వినియోగించి నేరుగా వైసిపి సర్కార్ పై మరోసారి యుద్ధానికి దిగిపోయారు హర్ష కుమార్. ఆయన ఉద్యమానికి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు అండగా నిలిచాయి. దాంతో హర్ష కుమార్ అనధికారికంగా టిడిపి లోకి ఎంట్రీ ఇచ్చినట్లే అన్న ప్రచారం సాగుతుంది. ఈ తరహా వ్యూహంతోనే ఆయన ఇకముందుకు వెళతారా లేక డైరెక్ట్ గా టిడిపి తీర్ధం తీసుకుని వైసిపి పై పోరాడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News