ఎక్కడా చప్పుడు లేదే….ఎందుకనో?

అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్షకుమార్‌.. చేసిన ప్రక‌ట‌న ఊహించిందే. ఏ చెట్టూ లేని చోట‌.. ఆము‌దం చెట్టే మ‌హావృక్షమ‌ని అన్నట్టుగా .. ఏ పార్టీలోనూ చోటు ద‌క్కద‌ని [more]

Update: 2020-10-12 06:30 GMT

అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్షకుమార్‌.. చేసిన ప్రక‌ట‌న ఊహించిందే. ఏ చెట్టూ లేని చోట‌.. ఆము‌దం చెట్టే మ‌హావృక్షమ‌ని అన్నట్టుగా .. ఏ పార్టీలోనూ చోటు ద‌క్కద‌ని భావించిన హ‌ర్షకుమార్ తిరిగి తాను త‌న మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్తాన‌ని ప్రక‌టించారు. ఇంత సంచ‌ల‌న ప్రక‌ట‌న చేసిన ఆయ‌న‌కు కాంగ్రెస్‌ను భారీ ఎత్తున రెడ్ కార్పెట్ స్వాగ‌తం ల‌భిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, చిత్రంగా ఆపార్టీ నేత‌లు ఒక్కరు కూడా కిక్కురుమ‌న‌లేదు. పైగా ఎవ‌రూ కూడా ఆయ‌న పార్టీలో వ‌స్తాన‌ని ప్రక‌టించిన వెంట‌నే ఎలాంటి ప్రక‌ట‌న చేయ‌లేదు. దీంతో హ‌ర్షకుమార్ కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్యం ల‌భిస్తుందా? అనేది ప్రశ్న.

ఏ ఒక్క పార్టీ కూడా….

వాస్తవానికి హ‌ర్షకుమార్ వ్యవ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు రెండు కీల‌క పార్టీల్లోకి జంప్ చేయాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. అయితే, ఏ ఒక్క పార్టీ కూడా ఆయ‌నను చేర్చుకోలేదు. పైగా మీరు రండి.. మీ గురించి త‌ర్వాత ఆలోచిస్తాం.. అని చెప్పడం గ‌మ‌నార్హం. 2004, 2009 ఎన్నిక‌ల్లో అమ‌లాపురం నుంచి ఎంపీగా కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న కాంగ్రెస్ నేత‌ల‌ను కొద్దిమందిని ఎంచుకుని స్నేహం చేశార‌నే విమ‌ర్శలు వ‌చ్చాయి. పైగా త‌న ధోర‌ణి త‌న‌దే అన్నట్టుగా వ్యవ‌హ‌రించారు. నాడు ముఖ్యమంత్రి వైఎస్‌కే యాంటీగా వ్యవ‌హ‌రించేవారు.

జై సమైక్యాంధ్ర నుంచి టీడీపీకి….

ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న‌కుచాలా మంది నేత‌లు దూరం పాటించారు. ఇక‌, రాష్ట్ర విభ‌‌జ‌న‌తో ఆయ‌న అప్పటి సీఎం కిర‌ణ్‌కుమార్ ప్రారంభించిన జై స‌మైక్యాంధ్రలో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై అమ‌లాపురం నుంచి పోటీ చేసి క‌నీసం డిపాజిట్‌కూడా సంపాయించుకోలేక పోయారు. హ‌ర్షకుమార్ త‌న‌యుడు టి.గ‌న్నవ‌రం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి చిత్తుగా ఓడారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే చంద్రబాబు హ‌యాంలో ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే.. ఆయ‌న చేరేందుకు వెనుకాడారు. త‌ర్వాత ప‌రిణామాల‌తో.. ఆయ‌న టీడీపీకి చేరువ‌య్యారు.

వ్యవహారశైలితోనే…..

అయితే, అప్పటికే అమ‌లాపురం టికెట్‌ను దివంగ‌త స్పీక‌ర్ బాల‌యోగి కుమారుడు హ‌రీష్ మాథూర్‌కు కేటాయించ‌డంతో.. పార్టీలో చేర‌కుండా త‌ప్పుకొన్నారు. చంద్రబాబుకు పాదాభివంద‌నం చేసిన కొద్ది రోజుల‌కే తిరిగి ఆయ‌న‌పై విరుచుకు ప‌డ్డారు. ఈ ప‌రిణామాలు ఆయ‌న‌కు కాస్తో కూస్తో ఉన్న ఫ్యాన్స్‌కు ఏ మాత్రం న‌చ్చలేదు. ఇక‌, అప్పటి నుంచి ఏదైనా పార్టీ త‌న‌ను ఆహ్వానించ‌కుండా ఉంటుందా ? అని ఎదురు చూసినా.. జ‌గ‌న్ స‌ర్కారుపై ఉద్యమాన్ని తీవ్రత‌రం చేసినా.. ఆయ‌న్ను ప‌ట్టించుకునే వారే లేరు. ఇక‌, చివ‌ర‌కు బీజేపీలో అయినా అవ‌కాశం వ‌స్తుందేమోన‌ని అనుకున్నా.. సోము వీర్రాజు ఆయ‌న చేరికను అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌తో తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నా.. అక్కడ కూడా జోష్ క‌నిపించ‌డం లేదు. మొత్తానికి హ‌ర్షకుమార్ వ్యవ‌హార శైలితో ఏ పార్టీ కూడా ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేద‌ని కోన‌సీమ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News