సౌండ్ లేదు ఎందుకో? బ్యాక్ గ్రౌండ్ తెలిసేనా?

సాధారణంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు యాక్టివ్ గా ఉంటారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ జీవీఎల్ ఎక్కువగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెడతారు. గత తెలుగుదేశం ప్రభుత్వం [more]

Update: 2020-04-22 09:30 GMT

సాధారణంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు యాక్టివ్ గా ఉంటారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ జీవీఎల్ ఎక్కువగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెడతారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జీవీఎల్ నరసింహారావు యాక్టివ్ గానే ఉన్నారు. ప్రధానంగా టీడీపీ బీజేపీతో విభేదించిన తర్వాత ఏపీ బీజేపీ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పాలి. సీబీఐపై చంద్రబాబు నిషేధం విధించడం, మోదీ తీరుసు నిరసిస్తూ నిరసనలు తెలియజేయడం వంటి వాటిపై జీవీఎల్ నరసింహారావు ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వంపై ఫైర్ అయ్యే వారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక….

కానీ వైసీపీ వచ్చిన తర్వాత జీవీఎల్ టోన్ కొంత తగ్గిందనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం జీవీఎల్ కు టీడీపీ అంటే ఉన్న వ్యతిరేకత కావచ్చు. వైసీపీ పట్ల సానుకూలత కావచ్చు. ఏపీ రాజధాని తరలింపు విష‍యంలోనూ జీవీఎల్ నరసింహారావు ప్రభుత్వానికే మద్దతు పలికారు. రాజధాని నిర్ణయం విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. దీంతో అప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని కామెంట్స్ చేసిన బీజేపీ నేతల నోళ్లు మూతబడ్డాయి.

నిమ్మగడ్డ విష‍యంలోనూ….

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడంపై జీవీఎల్ నరసింహారావు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, తాము వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్ర బీజేపీ మాత్రం నిమ్మగడ్డ రమేష‌ కుమార్ తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల అంశంలోనూ జీవీఎల్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. జనసేన, బీజేపీ నేతలు ఢిల్లీలో సమావేశమయినప్పుడు మాత్రమే జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకూ రాలేదు.

కన్నా పై విమర్శలపైనా….

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి కన్నా 20 కోట్లకు అమ్ముడు పోయారని కామెంట్స్ చేశారు. కానీ దీనిపై జీవీఎల్ నరసింహారావు ఏమాత్రం స్పందించలేదు. ఆయన ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరిలతో జీవీఎల్ గత కొంతకాలగా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అందుకే కన్నా విషయంలో తీవ్ర విమర్శలు వచ్చినా ఆయన స్పందించడం లేదంటున్నారు.

Tags:    

Similar News