ట్రై చేసి చూడు లక్కుంటుందేమో
హర్షకుమార్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009లో అమలాపురం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. ఎప్పుడో [more]
హర్షకుమార్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009లో అమలాపురం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. ఎప్పుడో [more]
హర్షకుమార్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009లో అమలాపురం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. ఎప్పుడో యూనివర్సీటీ లీడర్‌గా ఉండగానే వి.హనుమంతరావు దయతో 1985లోనే పాయకరావుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో హర్షకుమార్ పోటీయే ఓ సంచలనం. ఆ తర్వాత రాజమండ్రి మేయర్‌గానూ ఓడారు. చివర్లో వైఎస్ దయతో సీటు దక్కించుకుని తొలిసారి హర్షకుమార్ ఎంపీగా గెలిచాక అదే వైఎస్‌కు ఏకుమేకయ్యారు.
సైలెంట్ గా ఉండి…..
ఆ తర్వాత రాష్ట్ర విభజనను హర్షకుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఆయన ఎలాంటి అడుగులు వేయాలని అనుకుంటున్నారు? ఎటువైపు ఆయన పయనం సాగనుంది? అనే చర్చ కోనసీమ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏ పార్టీకి అను కూలంగాను, వ్యతిరేకంగాను మాట్లాడకుండా మౌనం వహించారు హర్షకుమార్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జైసమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి హర్షకుమార్ ఓడారు. ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నా తన విద్యా సంస్థలకు సంబంధించిన వివాదం పై మాత్రం ఒకసారి ధర్నా చేసి అరెస్టు అయ్యారు.
రాజకీయంగా దూరంగా…..
ఇక, రాజకీయాల పరంగా మాత్రం హర్షకుమార్ ఎక్కడా స్పందించలేదు. రాష్ట్ర హక్కులు, కేంద్ర చట్టం, రాష్ట్ర విభజన సమస్యలపై మాత్రం అప్పుడప్పుడు ఆయన స్పందించేవారు. ఇక, 2017లో ఇతర పార్టీల నాయకులను కూడా చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకుంటున్న తరుణంలోనే హర్ష కుమార్ టీడీపీలోకి రావాలని ప్రయత్నించారు. అదే సమయంలో అమలాపురం ఎంపీ టికెట్‌ను ఆశించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు హర్షకుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్‌కు రాం రాం పలికిన హర్షకుమార్.. పార్టీ మారి సైకిల్ ఎక్కారు. పార్టీలో చేరిక సందర్బంగా చంద్రబాబుకు పాదాభివందనం చేయడం అప్పట్లో వివాదమయింది.
టీడీపీలోచేరి టిక్కెట్ మిస్ అయి…
అయితే, ఎన్నికల సమయానికి వచ్చేసరికి.. రాష్ట్రంలో టఫ్ ఫైట్ నెలకొనడంతో కొన్ని సీట్లలో చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. ఈ క్రమంలోనే అమలాపురం ఎంపీ సీటును దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడుకి కేటాయించారు. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన హర్షకుమార్.. వెనువెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక, ఆ ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీకి హర్షకుమార్ సహకరించారు. దీంతో టీడీపీ ఓటమిపాలైంది. తనకు టికెట్ ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదని తన అనుచరుల వద్ద కూడా హర్షకుమార్ వ్యాఖ్యానించారు.
వైసీపీలో చేరాలని ఉన్నా….
ఇక, ఇటీవల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జగన్ చేసిన వ్యాఖ్యలను హర్ష కుమార్ స్వాగతిస్తూ.. వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే చాలా మంది నాయకులతో కిక్కిరిసి ఉన్న వైసీపీలో కొత్తవారికి ఛాన్స్ దొరకడం అంత ఈజీకాదని అంటున్నారు పరిశీలకులు. మరి హర్షకుమార్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.