వారికి ఇస్తే వీరు చేస్తారా? అంతా అయోమయం
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉండటం ఒక రకంగా శుభపరిణామమే. పార్టీ [more]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉండటం ఒక రకంగా శుభపరిణామమే. పార్టీ [more]
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉండటం ఒక రకంగా శుభపరిణామమే. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పగ్గాలు చేపట్టేందుకు పోటీ పడుతుండటం ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఈ పోటీ పీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత ఎలాంట పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. ఒకరి కొకరు సహకరించుకుంటారా? అన్న సందేహం తలెత్తుతోంది.
ఎన్నికలకు ఇంకా…..
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో వేరొకరిని చీఫ్ గా నియమించాల్సి ఉంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ కసరత్తు పూర్తి చేశారు. అందరి నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. దీనిపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు. కానీ పోటీ తీవ్రంగా ఉంది. తెలంగాణలో జమిలి ఎన్నికలు రాకపోతే 2023 లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది.
రెడ్డి వర్గం నుంచి…
ఈ పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవి తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. ఈయనతో పాటు శాసనసభ్యుడు జగ్గారెడ్డి సయితం తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నేరుగా తన అభిప్రాయం తెలియజెప్పకపోయినా తన అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో తనదే పదవి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
బీసీ వర్గాల డిమాండ్…
కానీ రెడ్డి సామాజికవర్గం వారికే చీఫ్ పదవి ఇవ్వడమేంటని కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వి.హనుమంతరావు సీనియర్ అయిన తనకే అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. అంజనీకుమార్ యాదవ్ సయితం తాను రెండుసార్లు ఎంపీ అయ్యానని, తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. మరో బీసీ నేత మధు యాష్కి గౌడ్ సయితం ఢిల్లీ లో పీసీసీ చీఫ్ పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే ఎవరికి పదవి వచ్చినా మరొకరు సహకారం ఇవ్వడం కష్టమేనంటున్నారు. దీంతో పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరేవి కాదని చెబుతున్నారు.