బామ్మర్ది భావం తెలుసుకోవయ్యా
రాష్ట్రంలో రాజధాని అంశం తీవ్రమైన హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించేవారు కొందరైతే.. విమర్శించే వారు మరికొందరుగా రాష్ట్రం రెండుగా చీలిందనే చెప్పాలి. ఈ [more]
రాష్ట్రంలో రాజధాని అంశం తీవ్రమైన హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించేవారు కొందరైతే.. విమర్శించే వారు మరికొందరుగా రాష్ట్రం రెండుగా చీలిందనే చెప్పాలి. ఈ [more]
రాష్ట్రంలో రాజధాని అంశం తీవ్రమైన హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించేవారు కొందరైతే.. విమర్శించే వారు మరికొందరుగా రాష్ట్రం రెండుగా చీలిందనే చెప్పాలి. ఈ సమయం లో అమరావతినే ఉంచాలని, దీనినే రాజధానిగా అభివృద్ది చేయాలని వస్తున్న డిమాండ్లు పెరుగుతున్నా యి. దీనికి అనుగుణంగానే ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున కార్యాచరణ చేసి రైతులను రంగంలోకి దింపు తోంది. అదేసమయంలో చంద్రబాబు ఫ్యామిలీ మొత్తంగా కూడా రాజధానిలో పర్యటించి రైతులకు మద్దతిస్తోంది. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అదే జిల్లాకు చెందిన….
బాబు సతీమణి భువనేశ్వరి కూడా ఇక్కడ జనవరి 1న పర్యటించి భావోద్వేగంతో ప్రసంగించడమే కాకుండా ఉద్యమానికి తనవంతుగా చేతి గాజును బహూకరించారు. అయితే, రాష్ట్రంలో ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు సహజంగానే అందరి దృష్టీ టాలీవుడ్‌పై పడుతుంది. తెలుగు చిత్రసీమలోని కీలక నటులు ఎలా స్పందిస్తారనే ప్రశ్న ప్రజల నుంచి సహజంగానే వస్తుంది. అదే సమయంలో నందమూరి ఎన్టీఆర్ ఫ్యామిలీ వైపు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు చూస్తారు. ఆయా జిల్లాలతో నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఇలాంటి సమయంలో వారి మద్దతు కోసం ప్రయత్నిస్తారు.
బాలయ్య ఎందుకు?
ఇక, అనంతపురం వంటి నందమూరి ఫ్యామిలీకి కంచుకోట వంటి జిల్లాల్లోనూ ఈ కుటుంబం చేసే రాజకీయాలకు ప్రాధాన్యం ఉంది. ఎన్నికలు సహా ఇలాంటి కీలక సందర్భాల్లో నందమూరి ఫ్యామిలీ ఏం చేస్తుందా అని వేచి చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు అమరావతి విషయంలోనూ నందమూరి ఫ్యామిలీ స్పందిస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య, నటుడు జూనియర్ ఎన్టీఆర్ సహా హరికృష్ణ కుటుంబం ఈ విషయంలో అమరావతిపై ఎలా స్పందిస్తుంది? అనే ప్రశ్న తెర మీదికి వచ్చింది.
బాబు దీక్షలు చేస్తున్నా…..
అయితే, ఇప్పటి వరకు కూడా ఎవరూ కూడా దీనిపై స్పందించలేదు. అటు సీమలో ఆందోళనలు జరుగుతున్నా.. ఇటు అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నా.. బాలయ్య సహా ఎవరూ స్పందించలేదు. పైగా చంద్రబాబు ఇక్కడ దీక్షలు చేస్తున్నా వారు మాట్లాడడం లేదు. ఇక ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న వారే అమరావతిపై స్పందించని పరిస్థితి. ఈ క్రమంలోనే నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ సైతం సైలెంట్‌గా ఉంటున్నారు. ఇక్కడ వీళ్లకు రాజకీయ లక్ష్యాలు లేవు కాబట్టి వీరిని తప్పు పట్టలేం. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కీలకంగా ఉన్న బాలయ్య అసలు ఉద్దేశం ఏంటి? అమరావతి ఉన్నా లేకున్నా ఫర్వాలేదని అనుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.