ఉక్రోషం.. నిస్సిగ్గు… తెంపరితనం.. అందుకేనా?
జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్త కల్పించే 370 వ అధికరణ రద్దు నాటినుంచి దాయాదిదేశమైన పాకిస్ధాన్ ఉక్రోషంతో ఊగిపోతోంది. అసహనంతో రెచ్చిపోతోంది. కుట్రలకు పాల్పడుతోంది నియంత్రణ రేఖ [more]
జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్త కల్పించే 370 వ అధికరణ రద్దు నాటినుంచి దాయాదిదేశమైన పాకిస్ధాన్ ఉక్రోషంతో ఊగిపోతోంది. అసహనంతో రెచ్చిపోతోంది. కుట్రలకు పాల్పడుతోంది నియంత్రణ రేఖ [more]
జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్త కల్పించే 370 వ అధికరణ రద్దు నాటినుంచి దాయాదిదేశమైన పాకిస్ధాన్ ఉక్రోషంతో ఊగిపోతోంది. అసహనంతో రెచ్చిపోతోంది. కుట్రలకు పాల్పడుతోంది నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. ఇలా భారత్ ను ఇరుకునపెట్టేందుకు, రెచ్చగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇలాంటి నిర్నయమే తీసుకుని తెంపరితనాన్ని ప్రదర్శించింది భారత్ పై వ్యతిరేకతను చాటుకుంది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, షరియత్ కాన్ఫరెన్స్ భెన్ముర్ సయ్యద్ ఆలీ గిలానీ కి ప్రతిష్టాత్మకమైన నిషాన్-ఇ-పాకిస్ధాన్ అవార్డు ప్రకటించడం ద్వారా భారత్ ను రెచ్చగొట్టింది. తన అసహనాన్ని వెళ్ళగక్కింది.
పోరాటానికి గుర్తింపు అట….
నిషాన్-ఇ-పాకిస్ధాన్ ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం. మనదేశంలో భారత రత్న వంటిది. గిలానీకి అవార్డు ఇవ్వాలని కోరుతుా పాక్ సెనెట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమెాదించింది. ఖైబర్ ఫక్తూన్ క్వా ప్రావిన్స్ కు చెందిన జమాయత్ ఇస్లామ్ సెనెటర్ ముస్తాక్ అహమ్మద్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ ఖాన్ బలపరిచారు. సభ ముాజువాణీ ఓటుతో ఆమెాదించింది. ఇంతటితో సరిపెట్టుకోలేదు. ఏకంగా ఇస్లమాబాద్ నగరంలో గీలానీ పేరిట ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కుాడా తీర్మానించింది. కశ్మీర్ ప్రజల స్వయంనిర్లయాధికారం కోసం దశాబ్దాలపాటు గిలానీ చేసిన పోరాటానికి గుర్తింపు గా అత్యున్నత పురస్కారంతో గౌరవించనున్నట్లు పేర్కొంది.
ఇదేమీ కొత్త కాదు….
నిషాన్ – ఇ-పాకిస్ధాన్ అవార్డు విదేశీనేతలకు ఇవ్వడం కొత్తకాదు. ఆయారంగాల్లో విశేషకృషి చేసిన వారికి ఇవ్వడం సాధారణమే. 1977 లో భారత్ ప్రధానిగా చేసిన మెురార్జీదేశాయ్ కు ఈ అవార్డు ప్రకటించింది. అప్పటి సైనిక పాలకుడు జనరల్ జియాఉల్ హక్ ఈ అవార్డు ప్రకటించారు. 1974 లో భారత్ అణుపరీక్షల అనంతరం చైనా, పాకిస్ధాన్ లతో సత్సంబంధాలను పుపరుద్ధరించడంలో మెురార్జీదేశాయ్ కృషికి అవార్డును ఇస్తున్నట్లు అప్పటి పాక్ ప్రభుత్వం పేర్కొంది. అయితే అవార్డు ప్రకటనను తెరవెనుక వేరే కారణాలున్నట్లు అప్పట్లో రాజకీయవిశ్లేషకులు పేర్కొనేవారు. నాటి పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో పై జనరల్ జియావుల్ హక్ నేత్ృత్వంలోని సైనిక ప్రభుత్వం పలుకేసులు పెట్టింది. వీటిని విచారించిన సుప్రీంకోర్టు భుట్టోకు మరణ శిక్ష విధించింది. దీనిని రద్దు చేయాలంటుా అంతర్జాతీయా సమాజం పాక్ ను కోరింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నాటి ప్రధాని మెురార్జీదేశాయ్, విదేశాంగ మంత్రి అటల్ బీహార్ వాజ్ పేయి నిరాకరించారు. ఇది ఆదేశ అంతర్గత వ్యవహారమని వారు పేర్కొన్నారు. శత్రుదేశం ఇలా తటస్ధంగా వ్యవహరించినందుకు కృతజ్నతగా పాక్ మెురార్జీకి నిషాన్-ఇ-పాకిస్ధాన్ అవార్డు ప్రకటిందని అప్పట్లో చెప్పుకునేవారు.
అనేకమందికి ఈ అవార్డు…
పాక్ అత్యున్నత పౌర పురస్వారాన్ని విదేశీనేతలు ఎందరో పొందారు . ఇరాన్ రాజు షా, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజెబెత్, దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా, క్యూబా నేత ఫెడెల్ క్యాస్ట్రో, అమెరికా మాజీ అధ్యక్షులు ఐసోవర్, విక్సన్, చైనా మాజీ అధినేతలు లీపెంగ్, హూ జింటావో, లీకెకి యాంగ్, మలేసియా మాజీ ప్రధాని మషతీర్ మష్మర్, టర్కీ అధినేత తయ్యిప్ ఎర్డగోన్, ఆగాఖాన్, ఈ అత్యున్నత పురస్వారాన్ని అందుకున్నారు. ఆయా రంగాల్లో త్యున్నత సేవలు అందించిన వారికి అవార్డు ఇవ్వడంలో అర్ధం ఉంది. కానీ ఒక వేర్పాటువాద సంస్ధ అధినేతకు పౌరపురస్కారాన్ని ఇవ్వడం ఎంతవరకు సమాజం అన్నదేప్రశ్న.
ఉగ్రవాది అయిన….
కశ్మీర్ లోయను ఉగ్రవాదంలోకి, హింస లోకి నెట్టడంద్వారా వేలమంది కశ్మీరీ యువత, కుటుంబాల జీవితాలు నాశనం కావడానికి కారకుల్లో గిలానీ ఒకరన్న ఆరోపణ బలంగా ఉంది. కశ్మీర్ ప్రజల స్వయం నిర్లయాధికారం పేరుతో ప్రజలను రెచ్చగొట్టారు. కశ్మీర్ ను భారత్ నుంచి వేరుచేసి పాక్ లో కలపాలన్నదే గిలానీ జీవిత ద్యేయంగా చెప్పుకునేవారు. ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ కు ఆయన 2003 నుంచి జీవిత కాలం చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతకుముందు సోపోర్ నియెాజకవర్గం నుంచి ముాడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 91 సంవత్సరాల గిలానీ ఇటీవల హరియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అంతర్గత పరిస్ధితులే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని, పోరాటాల పట్ల శ్రద్ద తగ్గిందని 90 సంవత్సరాల గిలానీ తన రాజీనామాకు గల కారణాల్లో పేర్కొన్నారు. అయితే కశ్మీరులో, సరిహద్దుల వెంట డబ్బు, అధికారాల పంపిణీకి సంబంధించిన హరియత్ లో నెలకొన్న విభేధాలు గిలానీ రాజీనామాకు కారణమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హరియత్ అధికార పదవికి తన వారసుడిగా పెద్ద కుమారుడు డాక్టర్ నయీమ్ ను నామినేట్ చేస్తుా వీలునామా రుాపొందించడంపై విమర్శలు రావడంలో గిలానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 370 అధికరణ రద్దు తరువాత ఏంచేయాలో దిక్కుతోచని పాక్ గిలానీ కి అవార్డు ప్రకటించిందన్న వాదన ఉంది. ఒక వేర్పాటువాద సంస్ధనాయకుడు అత్యుత్తమ పురస్కారానికి ఎలా అర్హుడు అవుతాడో పాక్ పాలకులకే తెలియాలి.
-ఎడిటోరియల్ డెస్క్