జగన్ కు ఆ ఛాన్స్ ఇవ్వరా….?
వై.ఎస్. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు. ఇది కదా వైసీపీ స్లోగన్. కానీ ఏపీలో ఉన్న అనేక ఆర్ధిక పరిస్థితులు ఆయన్ని కొంచెం తడబాటుకు గురి [more]
వై.ఎస్. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు. ఇది కదా వైసీపీ స్లోగన్. కానీ ఏపీలో ఉన్న అనేక ఆర్ధిక పరిస్థితులు ఆయన్ని కొంచెం తడబాటుకు గురి [more]
వై.ఎస్. జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు. ఇది కదా వైసీపీ స్లోగన్. కానీ ఏపీలో ఉన్న అనేక ఆర్ధిక పరిస్థితులు ఆయన్ని కొంచెం తడబాటుకు గురి చేస్తున్నాయి. ఖాళీ ఖజానా వెక్కిరిస్తూ వై.ఎస్. జగన్ తపనని తగ్గించేస్తోంది. ఆయన మడమని కాస్త తిప్పేలా చెస్తోంది. అయినా ఎక్కడా రాజీ పడకుండా ఉన్నంతలో నిధులు పోగు చేసైనా నవరత్నాలు హామీలు నెరవేర్చాలని నానా తంటాలు పడుతున్నారు. అది అలా ఉంచితే వై.ఎస్. జగన్ తనకు చేతనైన పనిని, చేతిలో ఉన్న అవకాశాల మేరకు వెంటనే చేయాల్సినవి చేసేస్తున్నారు. ఆ విధంగా అయన మాట తప్పని మనిషి అనిపించుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. మరి వై.ఎస్. జగన్ తన పరిధిలో లేని వాటి విషయంలో ఏం చేస్తారు. ఆ పరిస్థితులే వచ్చి మాట తప్పించేలా చేస్తే ఏం చేయగలుగుతారు.
జమిలి వస్తే నో చాన్స్….
ఓ వైపు కేంద్రంలో నరేంద్ర మోడీక్, అమిత్ షాకు జమిలి సరదా పట్టుకుంది ఒకే దేశం ఒకే ఎన్నికల కాన్సెప్ట్ ఎందుకో అమలు చేయాలని తెగ తాపత్రయపడుతున్నారు. అలా చేసి ఈ దేశాన్ని కొంతకాలమైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని వారి ఆశ. ఎపుడో 1950లో బీజేపీ పూర్వ రూపం జనసంఘ్ పుట్టింది. నాటి నేతలు అనుకున్నవి, ఆశలుగా, ఆశయాలుగా పెట్టుకున్నవి చేసేందుకు ఇపుడు బీజేపీకి మహత్తర అవకాశం వచ్చింది. బీజేపీ దీన్ని వదలదలచుకోదన్నది కచ్చితమైన సత్యం. మరి జమిలి ఎన్నికలే వస్తే ఏపీలో వై.ఎస్. జగన్ అధికారానికి రెండేళ్లకు పైగా కోత పడిపోతుంది. 2022కే ఆయన ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అపుడు వై.ఎస్. జగన్ మంత్రి వర్గ విస్తరణ వంటివి చేయడానికి కూడా అసలు అవకాశం ఉండదు.
ఇదే వైసీపీలో ఆందోళన….
వై.ఎస్. జగన్ తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నపుడు గెలిచిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలకు ఓ మాట చెప్పారు. ఇపుడు తాను రాజ్యాంగ నిబంధనల మేరకు 25 మందినే తీసుకుంటున్నానని, మరో రెండున్నరేళ్ళ తరువాత మరో పాతిక మందికి కచ్చితంగా చాన్స్ ఇస్తానని కూడా వై.ఎస్. జగన్ గట్టి హామీ ఇచ్చారు. మరి ఇపుడు అది సాధ్యమేనా అన్న చర్చ మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో మొదలైందిట. అక్షరాలా రెండున్నర ఏళ్ళకు వై.ఎస్. జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడితే తమకే చాన్స్ అని భావిస్తున్న వారంతా ముంచుకొస్తున్న జమిలి ఎన్నికలను చూసి జడుసుకుంటున్నారుట. అంతా అనుకున్నట్లుగా జరిగితే మూడేళ్ల వ్యవధిలో ఎన్నికలు వచ్చేస్తాయి.
విస్తరణ చేపడితే…..
వై.ఎస్. జగన్ చెప్పినట్లుగా మంత్రివర్గ విస్తరణ అన్నది అపుడు అసలు కుదిరే వ్యవహారం కానే కాదు. ఎందుకంటే ఎన్నికలు ముంచుకొచ్చే వేళ తీరి కూర్చుని కొత్తవారికి శాఖలు అప్పగించాలని ఎవరూ అనుకోరు. సో. జమిలి ఎన్నికలు వస్తే మాత్రం ఆశావహులకు మంత్రి పదవులు రద్దే మరి. ఆ విధంగా వై.ఎస్. జగన్ కూడా మాట నిలబెట్టుకోలేరంటున్నారు. వై.ఎస్.జగన్ తన మాటను తీర్చుకోవాలంటే మళ్ళీ ఎన్నికలలో ఆయన పార్టీ గెలవాలి. ఆశావహులు కూడా గెలవాలి. మొత్తానికి జమిలి ఎన్నికలు ఎంత పని చేస్తాయోనని వైసీపీ శిబిరం హడలిపోతోంది.