ఎన్టీయార్ చివరి కోరిక అదేనా ?
దివంగత నేత, తెలుగు తేజం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చివరి కోరిక ఏంటి అన్నది ఆసక్తిని కలిగించే విషయమే. డెబ్బయి మూడేళ్ళ [more]
దివంగత నేత, తెలుగు తేజం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చివరి కోరిక ఏంటి అన్నది ఆసక్తిని కలిగించే విషయమే. డెబ్బయి మూడేళ్ళ [more]
దివంగత నేత, తెలుగు తేజం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చివరి కోరిక ఏంటి అన్నది ఆసక్తిని కలిగించే విషయమే. డెబ్బయి మూడేళ్ళ ముదిమి వయసులో తన సొంతవారి చేతుల్లోనే అధికారం కోల్పోయిన ఎన్టీఆర్ మనోవేదన పగవారికి సైతం కలుగరానిదే. ఇక ఎన్టీఆర్ బతికున్నంతవరకూ అల్లుడు చంద్రబాబుని ద్వేషించారు కాబట్టి ఆయన చివరి కోరిక చంద్రబాబు రాజకీయ పతనం అని అంతా అనుకున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఓడి ఓ విధంగా రాజకీయ చరమాంకంలోనే చంద్రబాబు ఉన్నారు. కానీ దాంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించదుట.
జైలుకెళ్ళాల్సిందే…..
టీడీపీ నాతోనే ఉంటుంది. నాతోనే పోతుంది, ఇది నా పార్టీ అని అన్న గారు అప్పట్లో తరచూ అనేవారు. అయితే అది చంద్రబాబు పరమైంది, అదే ఎన్టీఆర్ కి శాపమైంది. బతికుండగానే నరకయాతన అనుభవించిన ఎన్టీఆర్ చివరికి చనిపోతూ కూడా చిన్నల్లుడిని క్షమించలేదు. ఎన్టీఆర్ కోరుకున్నట్లుగా ఆయనతో టీడీపీ అంతం కాకపోయినా చంద్రబాబుతో అంతమయ్యేలా ఆ పార్టీ పరిస్థితి ఇపుడు ఉంది. అది సరే కానీ చంద్రబాబు జైలుకు వెళ్తేనే తప్ప అన్న గారి ఆత్మ శాంతించదట. ఆ విషయాన్ని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చెబుతున్నారు.
అలా చేయాలని….
తాను మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబుని అండమాన్ జైల్లోకే పంపుతానని మామ ఎన్టీఆర్ ఆనాడే భీషణ ప్రతిన చేశారట. విధి వక్రించి ఆయన కన్నుమూశారు, మరి ఆయన కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందని అది ఇపుడు తీరే రోజు వచ్చిందని లక్ష్మీపార్వతి అంటున్నారు చంద్రబాబుని జైలుకు పంపించడమే ఇక మిగిలిందని, అది జరిగితీరుతుందని కూడా ఆమె జోస్యం చెబుతున్నారు.
దోచుకుతిన్నారుగా….?
గత అయిదేళ్ళూ ఏపీని చంద్రబాబు, ఆయన ముఠా దోచుకుని తిన్నారని, వారి అవినీతికి జైలు శిక్షలే సరైనవని లక్ష్మీపార్వతి అంటున్నారు. అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని ఆమె గట్టిగానే చెబుతున్నారు చంద్రబాబు జైలుకు వెళ్ళడం అన్న గారి కోరికైతే చంద్రబాబుతో పాటు మొత్తం గ్యాంగ్ జైలుకు వెళ్ళాలన్నది తన కోరికగా ఆమె చెప్పుకున్నారు. అంతే కాదు ఆ రోజు తొందరలోనే వస్తుందని కూడా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అవును మరి, చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఏసీబీ కోర్టులో ఇపుడు ఉంది. దాని మీద పిటిషన్ వేసిందీ లక్ష్మీ పార్వతే. మరో వైపు జగన్ సర్కార్ వేసిన సిట్ విచారణ, కేంద్రం చేయిస్తున్న ఐటీ దాడులు ఇవన్నీ చూసుకునే చంద్రబాబు జైలుకెళ్ళడం తధ్యమని అన్న గారి సతీమణి అంటున్నారేమో.