ఇమ్రాన్ భయ్యా… ఇలా చేశావేమయ్యా?
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్. ఆయన ఫాస్ట్ బౌలింగ్ తో వందలాది వికెట్లు పడగొట్టిన ఘనతను సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే ఇమ్రాన్ ఖాన్ [more]
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్. ఆయన ఫాస్ట్ బౌలింగ్ తో వందలాది వికెట్లు పడగొట్టిన ఘనతను సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే ఇమ్రాన్ ఖాన్ [more]
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్. ఆయన ఫాస్ట్ బౌలింగ్ తో వందలాది వికెట్లు పడగొట్టిన ఘనతను సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే ఇమ్రాన్ ఖాన్ తన నిర్లక్ష్యంతో కరోనా వైరస్ ను దేశమంతా వ్యాప్తి చేశారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. కరోనాను నియంత్రించడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. ఇమ్రాన్ ఖాన్ చేతకానితనంతో పాక్ ఇప్పుడు కరోనా నుంచి కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.
పెరుగుతున్న కేసులు….
పాకిస్థాన్ ను కరోనా కబళిస్తుంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ కరోనా దెబ్బకు మరింత దిగజారింది. ఎక్కువగా పంజాబ్, సింధూ ప్రావిన్స్ లలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేయడమే. ఇప్పటికే పాకిస్థాన్ లో 1500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు మందికి పైగా చనిపోయారు.
లాక్ డౌన్ ప్రకటించకుండా….
పాకిస్థాన్ లో ఇరవై కోట్ల మంది ప్రజలు ఉండగా, కేవలం ఆరువేల మందికి మాత్రమే ఇప్పటి వరకూ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాకిస్థాన్ లో జనవరి 26వ తేదీన కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయినా ఇమ్రాన్ ఖాన్ లాక్ డౌన్ ప్రకటించలేదు. లాక్ డౌన్ ప్రకటించే శక్తి తమకు లేదని, ఆర్థికంగా తమ దేశం తట్టుకోలేదని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రజలే స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించాలని పిలుపు నిచ్చారు. కానీ ప్రజలు లైట్ గా తీసుకున్నారు.
చైనా సాయం కోసం….?
ఇరాన్ నుంచి అనేక మంది పాకిస్థాన్ కు వచ్చారు. వారందరికీ బలూచిస్థాన్ ప్రాంతంలో తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారంటైన్ లో ఉంచకుండా వదిలేశారు. కనీసం దేశ సరిహద్దులను కూడా మూసివేసే ప్రయత్నం కూడా చేయలేదు. అంతటితో ఆగకుండా సైన్యాలు ఉన్న చోట కరోనా పాజిటివ్ కేసులు ఉండకూడదని నిర్ణయించిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దాదాపు 200 మందిని పీవోకే వద్ద ఉంచడం కూడా అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పాక్ మునిగిపోయింది. చివరకు తన మిత్రదేశమైన చైనా సాయాన్ని అర్ధించింది. చైనా వైద్య పరంగా సాయం అందించేందుకు ముందుకు వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇమ్రాన్ ఖాన్ వ్యవహారశైలి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.