ఆధిప‌త్య ర‌గ‌డ‌లు.. ఆగేదెన్నడు..? ఆపేదెవ్వరు..?

ఆధిప‌త్య రాజ‌కీయాలు ఏ పార్టీలో అయినా ఉంటాయి. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయం జోరుగానే సాగింది. అయితే.. అధినేత ఎక్కడక‌క్కడ [more]

Update: 2021-08-01 09:30 GMT

ఆధిప‌త్య రాజ‌కీయాలు ఏ పార్టీలో అయినా ఉంటాయి. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయం జోరుగానే సాగింది. అయితే.. అధినేత ఎక్కడక‌క్కడ ఆధిప‌త్య రాజ‌కీయాల‌ను క‌ట్టడి చేస్తూ వ‌చ్చారు. దీంతో పార్టీలో డిసిప్లిన్ ఎక్కడా దారిత‌ప్పలేదు. అధినేత‌పై ఎక్కడా గౌర‌వ‌మూ త‌ర‌గ‌లేదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం ఆధిప‌త్య రాజకీయాలు నిత్యం ర‌గులుతూ పెరుగుతూ.. ఉన్నా.. అడ్డుక‌ట్టవేసేవారు.. పిలిచి కూర్చోబెట్టి ప‌రిష్కరించేవారు.. క‌నిపించ‌డం లేదు.

అన్ని జిల్లాల్లోనూ…?

రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లోనూ వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర ఆధిప‌త్య రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నా యి. ఇప్పటికే కొన‌సాగుతున్నవి కొన్నయితే.. కొత్తగా తెర‌మీదికి వ‌స్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. మ‌రి వీటికి అడ్డుక‌ట్ట వేయాల్సిన బాధ్యత‌ను ఎవ‌రు తీసుకుంటున్నారు? ఆయా ర‌గ‌డ‌ల‌కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడ‌తారు? అనే ప్రశ్నలు మాత్రం అలానే ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు సాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య పోరు మ‌రింత పెరిగింది.

మళ్లీ మొదటి కొచ్చిన….

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదంటూ ఏకంగా ఎంపీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు, చిలకలూరి పేట ఎమ్మెల్యే రజనీల మధ్య విబేధాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఈ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎంపీ ఎప్పుడు నియోజకవర్గంలోకి వచ్చినా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం, రచ్చ రచ్చ చేయడం రొటీన్‌గా మారింది.

ఇన్ ఛార్జి మంత్రులు సయితం…?

అదేవిధంగా తూర్పుగోదావ‌రిలోనూ నేత‌ల మ‌ధ్య పొసగడం లేదు. కృష్ణా జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. అయిన‌ప్పటికీ.. పార్టీ అధినేత కానీ, కీల‌క స‌ల‌హాదారులు కానీ.. ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. జిల్లాల్లో పార్టీ బాధ్యత‌ల‌ను ఇంచార్జ్ మంత్రుల‌కు అప్పగించారు. సో.. వారే చూసుకుంటారులే.. అని ఉదాసీన‌తో లేక‌.. ఇప్పుడు కొట్టుకుంటున్నా.. మున్ముందు.. స‌ర్దుకుంటార‌నే భావ‌నో.. తెలియ‌దు కానీ ఇప్పటికైతే.. వైసీపీలో నేత‌లు ర‌గ‌డ‌ల‌కు సై అంటున్నారు.

పార్టీకి నష్టమే…..

తూర్పు గోదావ‌రి జిల్లాలో మంత్రి కుర‌సాల క‌న్నబాబు వ‌ర్సెస్ ఎమ్మెల్యే ద్వారంపూడికి ప‌డ‌ట్లేదు. మ‌రో మంత్రి వేణుకు కొత్త ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎంపీ బోస్‌తోనూ గొడ‌వ ఉంది. ఇక రాజోలు రాజ‌కీయం ర‌చ్చ ర‌చ్చగానే ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గొడ‌వ‌ల‌కు అంతూ పంతూ లేదు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. నేత‌లు ప‌ట్టుకోల్పోవ‌డమే కాకుండా.. పార్టీకి కూడా న‌ష్టం క‌ల‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News