సర్దుబాట్లు పూర్తయ్యాయి.. సెటిల్ చేసుకున్నారు

బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. మహాకూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ 70, ఆర్జేడీ 144, [more]

Update: 2020-10-11 18:29 GMT

బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. మహాకూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ 70, ఆర్జేడీ 144, వామపక్షాలు 29 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాకూటమి తేజస్వి యాదవ్ ను ప్రకటించింది. మరో వైపు ఎన్డీఏ కూటమి కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంది. బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల విషయంలో అవగాహన కుదిరింది.

ఫిఫ్టీ… ఫిఫ్టీ ఫార్ములా…..

తొలినుంచి బీజేపీ, జేడీయూలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. అమిత్ షా గతంలో నితీష్ కుమార్ ను కలిసినప్పుడే ఈ నిర్ణయం జరిగిపోయింది. ఏ సీట్లు అన్నది తేలకపోయినా చెరి సగం స్థానాల్లో పోటీకి దిగాలని రెండు పార్టీలూ మాత్రం ఎన్నడో ఒక అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు జరిగిన చర్చల్లో రెండు పార్టీలూ సీట్ల పంపకాల విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

సీట్ సర్దుబాటు….

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. ఇందులో జనతాదళ్ యూ 122 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే భారతీయ జనతా పార్టీ 121 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ పార్టీలకు మళ్లీ కొన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. జేడీయూ తన పార్ట్ నర్ అయిన హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీకి కొన్ని సీట్లను కేటాయించాల్సి ఉంది. జేడీయూ ఆ పార్టీకి ఏడు స్థానాలను కేటాయించే అవకాశముంది.

ఎవరికి కేటాయించిన సీట్లలో…..

ఇక బీజేపీ మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ తనకు కేటాయించిన 121 సీట్లలోనే కేటాయించాల్సి ఉంటుంది. అదే ఒప్పందం ప్రకారం సీట్ల సర్దుబాటు జరిగింది. లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ పదిహేను స్థానాలను కేటాయించే అవకాశముందని, మరీ పట్టుబడితే 20 వరకూ స్థానాలను కేటాయించ వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ జనశక్తి పార్టీ తమకు 45 సీట్లు కావాలని డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద బీహార్ లో అధికార పక్షమైన ఎన్డీఏలో సీట్ల సర్దుబాబు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పాలి.

Tags:    

Similar News