మహారాష్ట్ర లో ఎవరినీ వదలడం లేదు

మహారాష్ట్ర చైనాను మించిపోయింది. లక్ష కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కన్పించడం లేదు. మహారాష్ట్రలో మార్చి 9వ తేదీ నుంచి [more]

Update: 2020-06-19 17:30 GMT

మహారాష్ట్ర చైనాను మించిపోయింది. లక్ష కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కన్పించడం లేదు. మహారాష్ట్రలో మార్చి 9వ తేదీ నుంచి కరోనా వైరస్ ప్రారంభమయింది. అంటే కేవలం మూడు నెలల్లోనే ఒక కేసు నుంచి లక్ష కేసులకు చేరుకోవడం నిజంగా దురదృష్టకరమే. మహారాష్ట్రలో పోలీసులను కూడా కరోనా వదలడం లేదు. వందల సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడ్డారు.

ముగ్గురు మంత్రులకు…

ఇక మహారాష్ట్రలో ముగ్గురు మంత్రులకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన మంత్రుల్లో ధనుంజయ్ ముండే, జితేంద్ర అవ్హద్, అశోక్ చవాన్ లాంటి వారు కరోనా వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్ర కరోనా కేసుల సంఖ్క పరంగా చూసుకుంటే చైనా, కెనాడా వంటి దేశాలను కూడా దాటేసిందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం సామాజిక వ్యాప్తి అని అన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో….

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేలో అసహనం కన్పిస్తుంది. ఒక దశలో ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తానని హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యాభై వేల కేసులు కేవలం పందొమ్మిది రోజుల్లోనే నమోదవ్వడంతో కరోనా వైరస్ ఇప్పట్లో ఆగదన్న ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో టచ్ లో ఉంటుంది.

ముంబయి మాత్రం…..

ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా లక్ష కేసులు నమోదయినా ఒక్క ముంబయి నగరంలోనే యాభై వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ముంబయిలో 55 వేల కేసులకు పైగానే నమోదయ్యాయి. ముంబయి తర్వాత అత్యథికంగా థానే నగరంలో సుమారు పదిహేడు వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. కోలుకునే వారి శాతం తక్కువగా ఉండటం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గిస్తుంది. మొత్తం మీద మహారాష్ట్ర ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు.

Tags:    

Similar News