అవమానం.. అహాన్ని దెబ్బతీస్తున్నారా?
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో యుద్ధమే జరుగుతుంది. మహారాష్ట్రలో ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం [more]
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో యుద్ధమే జరుగుతుంది. మహారాష్ట్రలో ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం [more]
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో యుద్ధమే జరుగుతుంది. మహారాష్ట్రలో ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనికి ధీటుగా శివసేన సర్కార్ కూడా స్పందిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధవాతావరణమే నెలకొందని అంటున్నారు.
సుశాంత్ సింగ్ ఆత్మ హత్య కేసులో…..
ప్రధానంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య కేసులో మహారాష‌్ట్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంది. సుశాంత్ సింగ్ హత్య కేసును తొలుత ముంబయి పోలీసులు విచారణను చేపట్టారు. అయితే దీనిపై విచారణ సక్రమంగా జరపడం లేదని, కొందరు బాలీవుడ్ పెద్దలను కాపాడే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ నేతలు పదే పదే ఆరోపించారు. సుబ్రహ్మణ్యస్వామి వంటి నేతలు సీబీఐ దర్యాప్తును కోరారు. మహారాష్ట్ర సర్కార్ ససేమిరా అనడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి ఈ కేసును అప్పగించింది.
కంగనా రనౌత్ కేసులో….
ఇది మహారాష్ట్ర సర్కార్ ప్రతిష్టను దెబ్బతీసింది. దీంతో పాటు బాలివుడ్ నటి కంగనా రనౌత్ సుశాంత్ సింగ్ కేసులో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఆమె అభివర్ణించారు. దీంతో శివసేన కంగనా రనౌత్ పై విరుచుకు పడింది. ముంబయికి ఎలా వస్తారో అని సవాల్ విసిరింది. దీంతో కంగనా రనౌత్ కేంద్ర హోంశాఖను ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ కంగనా రనౌత్ కు వై కేటగిరి భద్రత కల్పించింది.
అమితుమీ తేల్చుకునేందుకు….
కంగనా రనౌత్ కు వై కేటగిరి భద్రత కల్పించడంపై మహారాష్ట్ర సర్కార్ అహాన్ని దెబ్బతీసింది. దీంతో గతంలో కంగనా రనౌత్ పై ఉన్న కేసులను బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. కంగనా రనౌత్ పై కూడా డ్రగ్స్ ఆరోపణలున్నాయి. దీనిపై నిజనిజాలు నిగ్గుతేల్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష‌్ట్ర ప్రభుత్వానికి మధ్య నేరుగానే వార్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంతో అమితుమీతో తేల్చుకునేందుకే మహారాష్ట్ర సర్కార్ సిద్ధపడిందనే చెప్పాలి.