ఖుష్బూను అందుకనే దించారా?
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పక్కా వ్యూహంతోనే వెళుతున్నట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో జాతీయపార్టీలు సయితం ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నాయి. కాంగ్రెస్ డీఎంకే కూటమిలో ఉండగా, బీజేపీ [more]
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పక్కా వ్యూహంతోనే వెళుతున్నట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో జాతీయపార్టీలు సయితం ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నాయి. కాంగ్రెస్ డీఎంకే కూటమిలో ఉండగా, బీజేపీ [more]
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పక్కా వ్యూహంతోనే వెళుతున్నట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో జాతీయపార్టీలు సయితం ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నాయి. కాంగ్రెస్ డీఎంకే కూటమిలో ఉండగా, బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో ఉంది. అయితే అన్నాడీఎంకే పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో కొంత అసంతృప్తి ఉంది. మరోవైపు అన్నాడీఎంకేకు నాయకత్వం వహించడానికి జయలలిత కూడా లేరు. ఇప్పుడున్న నేతలు పార్టీని విజయం వైపు తీసుకెళ్లలేరన్న ఆలోచనలో బీజేపీ ఉంది.
అన్నాడీఎంకేలో నాయకత్వ లోపం….
పళనిస్వామిని అన్నాడీఎంకే ఇటీవల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పళనిస్వామికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇమేజ్ వచ్చింది. ఆయన ఫేస్ వాల్యూలేని నేత. ఇక పన్నీర్ సెల్వం కూడా అంతే. ఆయనకు సొంత ప్రాంతంలోనే పెద్దగా గుర్తింపు లేని నేత. జయలలిత దయతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలను చేపట్టారు. అమ్మకు నమ్మకమైన నేతగానే ఆయనకు గుర్తింపు ఉంది తప్ప క్రౌడ్ పుల్లర్ కాదు.
క్రౌడ్ పుల్లర్ లేక…..
దీంతో రానున్న తమిళనాడు ఎన్నికల్లో కొంతైనా ఫలితాలు సాధించాలంటే వీరి నాయకత్వం పట్ల విశ్వాసం లేని భారతీయ జనతా పార్టీ సినీనటి ఖుష్బూను రంగంలోకి దించిందంటున్నారు. ఖుష్బూ సినీనటిగా తమిళులకు సుపరిచితులు. ఆమెకు తమిళనాడు నిండా అభిమానులున్నారు. ఖష్బూ కోసం గుడి కట్టించిన చరిత్ర కూడా తమిళనాడు వాసులది. ప్రస్తుత ఎన్నికల్లో అన్నాడీఎంకేను కూటమిని గట్టెక్కించేందుకు ఖష్బూను తెరమీదకు తెచ్చిందంటున్నారు.
ఆమెపైనే ఆశలా?
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఖుష్బూ ఇకపై తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొననున్నారు. ఆమె రూపం, ఆహార్యం జయలలితను పోలి ఉండటం కూడా కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఖష్బూను రానున్న ఎన్నికల్లో బీజేపీ తరుపున క్రౌడ్ పుల్లర్ గా దించాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడులో సినీగ్లామర్ కు ఓట్లు పంట పండుతుండటంతో ఖష్బూకు బీజేపీ గాలం వేసిందంటున్నారు. మరి ఖష్బూ వల్ల ఏ మేరకు అన్నాడీఎంకే కూటమికి ప్రయోజనం చేకూరుతుందో చూడాల్సి ఉంది.