ఇక్కడ రెడ్లు కుతకుతలాడి పోతున్నారట
రాష్ట్రంలో రెడ్డి రాజ్యం రావాలని కోరుకున్న రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు కుతకుతలాడుతోంది. మూడు ప్రాంతాల్లోనూ సీమలో పరిస్థితి ఒకరకంగా బాగానే ఉన్నా.. ముఖ్యంగా రాజధాని జిల్లా [more]
రాష్ట్రంలో రెడ్డి రాజ్యం రావాలని కోరుకున్న రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు కుతకుతలాడుతోంది. మూడు ప్రాంతాల్లోనూ సీమలో పరిస్థితి ఒకరకంగా బాగానే ఉన్నా.. ముఖ్యంగా రాజధాని జిల్లా [more]
రాష్ట్రంలో రెడ్డి రాజ్యం రావాలని కోరుకున్న రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు కుతకుతలాడుతోంది. మూడు ప్రాంతాల్లోనూ సీమలో పరిస్థితి ఒకరకంగా బాగానే ఉన్నా.. ముఖ్యంగా రాజధాని జిల్లా గుంటూరులో మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆవేదనతోను, ఆందోళనతోనూ ఉన్నారు. ఈ జిల్లాలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలతోపాటు కమ్మ వర్గం కూడా ఎక్కువగా ఉంది. అయితే రెడ్డి వర్గానికి ఆశించిన విధంగా జగన్ గుర్తింపు ఇవవ్వలేకపోతున్నారనేది.. ఇక్కడి వారి ఆవేదన. కీలకమైన నియోజకవర్గాలు.. మంగళగిరి, మాచర్ల, గురజాల, నరసరావుపేటలో వైసీపీ రెడ్లు విజయం సాధించారు. వీరంతా 2004 నుంచి వైఎస్ వెంటే ఉంటూ వస్తున్నారు. నాటి కాంగ్రెస్ పాలనలోనూ.. నేడు వైసీపీ పాలనలోనూ రెడ్లకు చాలా ప్రాధాన్యత దక్కుతోంది.
కాంగ్రెస్ పాలనలో…..
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాపట్ల, మాచర్ల, నరసారావుపేట, దుగ్గిరాల ( రద్దయ్యింది), సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రెడ్డి నేతలే ఎమ్మెల్యేలు. ఇప్పుడు కూడా నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. వీరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పిన జగన్.. ఈ హామీని నిలబెట్టుకోలేక పోయారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి విప్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. నాలుగుసార్లు గెలిచిన పిన్మెల్లి ప్రస్తుతం ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితోనే ఉన్నారట.
ఎలాంటి పదవులు దక్కక…..
ఇక, గురజాల నుంచి విజయం దక్కించుకున్న కాసు మహేష్ రెడ్డికి కూడా ఎలాంటి పదవులు దక్కలేదు. అంతేకాదు.. కీలకమైన డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు కూడా సమీకరణల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గాలకు దక్కుతున్నాయి. మరోవైపు జెడ్పీ చైర్మన్ గిరీ కూడా రెడ్డి వర్గానికి దక్కే పరిస్థితి లేదనే ప్రచారం.. మరింత ఆందోళనకు దారితీస్తోంది. నిజానికి టీడీపీ నేతలకు బలంగా ఉన్న నియోజకవర్గం నరసారావుపేటలోనూ వరుస వైసీపీ జెండా ఎగరేస్తున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటి వరకు ఆయన విషయం కూడా అంతంత మాత్రంగానే ఉంది.
అందరిలోనూ అసహనమే….?
మరోవైపు.. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా అసహనంతో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన మొహం చూడలేదు.. పార్టీ నాయకులు. ఇక ఎమ్మెల్యేలే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఎలాంటి పదవులు లేక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీ కోసం పదేళ్లుగా పనిచేసినా చిన్న పదవి కూడా లేదన్న ఆవేదన ఈ జిల్లా వైసీపీ రెడ్డి నేతలకు ఉంది. అందుకే ఈ జిల్లా రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర అసహనం పెల్లుబుకుతోందన్నది వాస్తవం.