వైసీపీలో ఏజ్‌బార్ నేతలకు టికెట్లు కట్.. నిజమేనా..?
అధికార పార్టీ వైసీపీలో కీలక విషయం చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏజ్ బార్ నేతలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని.. పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. [more]
అధికార పార్టీ వైసీపీలో కీలక విషయం చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏజ్ బార్ నేతలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని.. పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. [more]
అధికార పార్టీ వైసీపీలో కీలక విషయం చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏజ్ బార్ నేతలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని.. పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ నీయాంశంగా మారింది. గత ఎన్నికల్లోనే చాలా మంది సీనియర్లను పక్కన పెట్టిన జగన్.. అనేక మంది యువతను తన పార్టీలోకి తీసుకుని కొత్తవారైనా సరే ధైర్యంగా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అయినప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో తొలిసారి విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అనేక మంది వృద్ధులకు కూడా అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు బొబ్బిలిలో సామాజిక సమీకరణల నేపథ్యంలో వృద్ధుడు అయిన శంబంగి చిన అప్పలనాయుడు, ఆముదాలవలసలో తమ్మినేని సీతారాం, వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి, ఆచంటలో చెరుకువాడ రంగనాథ రాజు ఇలా చాలా మంది వయస్సు పైబడిన నేతలకు టిక్కెట్లు రావడం వాళ్లు గెలవడం జరిగాయి.
వ్యూహాత్మకంగా…
ఆ సక్సెస్ ఫార్ములానే ఇప్పుడు టీడీపీ కూడా ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎక్కువగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీలోనూ దానికి దీటుగా చర్యలు తీసుకుంటున్నారు. సరే బలం ఉన్న వాళ్లో, చచ్చో పుచ్చో కాని తెలుగుదేశంలో గత ఎన్నికల తర్వాత యువతలకు పార్టీ పదవులు వస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్ దీనికి విరుగుడు మంత్రం వేసే పనిలో ఉన్నారట. టీడీపీ యువ మంత్రానికి చెక్ పెట్టేలా.. వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి….
ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి అన్ని పదవులతో పాటు వచ్చే ఎన్నికల్లో వైసీపీలోయువతకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బొత్స సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ స్వామి, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, శంభంగి చిన అప్పలనాయుడు, చెరుకువాడ రంగనాథరాజు సహా అనేక మంది ఏజ్ బార్ నేతలకు ప్రత్యక్ష రాజకీయాల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని అంటున్నారు. అయితే.. వీరిలో చాలా మందికి నియోజకవర్గాలపై పట్టు ఉండడం, ఆయా సామాజిక వర్గాల్లో బలమైన ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో వీరిని వేరే కీలకమైన పార్టీ పదవుల్లోనూ.. రాజ్యసభ, మండలికి సిఫారసు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహిళలకు కూడా….
అయితే.. యువ నేతలుగా వారి వారసులకు కూడా అవకాశం దక్కే ఛాన్స్ తక్కువేనని అంటున్నారు. 'వారసత్వ రాజకీయం' అనే వాసనను పక్కన పెట్టి.. బడుగు, బలహీ న వర్గాలకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 33 శాతం మంది మహిళా యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ఖాయమనేనని కీలక సలహాదారు సైతం సంకేతాలు పంపించడం.. ఇప్పుడు పార్టీలో ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.