పక్కలో బల్లెం.. నెమ్మదిగా మొదలు పెడుతుందా?

భారత్-చైనా సంబంధాలు మెుదట నుంచీ ఎడమెాహం పెడమెాహమే. ఆది నుంచి ఇరు దేశాలు ఒకటినొకటి అనుమానాస్పదంగానే చుాసుకొంటున్నాయి. అప్పుడప్పుడు అధినేతల పరస్పర పర్యటనలు, అభివాదాలు, కరచాలనాలు కొనసాగుతున్నప్పటికీ [more]

Update: 2020-05-30 16:30 GMT

భారత్-చైనా సంబంధాలు మెుదట నుంచీ ఎడమెాహం పెడమెాహమే. ఆది నుంచి ఇరు దేశాలు ఒకటినొకటి అనుమానాస్పదంగానే చుాసుకొంటున్నాయి. అప్పుడప్పుడు అధినేతల పరస్పర పర్యటనలు, అభివాదాలు, కరచాలనాలు కొనసాగుతున్నప్పటికీ పరిస్ధితి మళ్ళీ మామూలే. 1962 నాటి యుద్ధం ఉభయదేశాల మధ్య గల సంబంధాలను దెబ్బతీసింది. కమ్యూనిస్టు దేశమైన చైనా నమ్మించి మెాసగించిందని, దాడికి దిగుతుందని తాను ఊహించలేదని నాటి ప్రధాని నెహ్రు ఆవేదన వ్యక్తం చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. యుద్ధంలో ఓటమి ఆవేదన ఆయన మరణానికి ఒక కారణమని కుాడా చెబుతుంటారు. ఇరుదేశాలమద్య విభేదాలకు కారణం టిబెట్. ఇది స్వతంత్ర దేశమన్నది భారత్ వాదన. తమ దేశంలో భాగమన్నది చైనా అభిప్రాయం. చైనా దక్షిణ టిబెట్ గా పేర్కొనే మన అరుణాచల్ ప్రదేశ్ తనదని బీజింగ్ ఇప్పుటికీ బల్లగుద్ది వాదిస్తుంటోంది. ఈ సరిహద్దు రాష్ట్రంలో భారత్ ప్రధాని, రాష్ట్రపతుల పర్యటన సందర్బంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మక్ మహన్ రేఖ వద్ద…

రెండు దేశాల మధ్య దాదాపు 4,057 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీనినే మక్ మహన్ లైన్ అని కూడా అంటారు. నాటి బ్రిటీష్ అధికారి ఈ సరిహద్దును నిర్ణయించారు. దీనిని వాస్తవాధీన రేశ అని కూడా వ్యవహరిస్తారు. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలు చైనాలో సరిహద్దును కలిగి ఉన్నాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అత్యంత కీలకమైనవి, వివాదస్పదమైనవి. వ్యూహాత్మకంగా ఇవి కీలకం కావడంతో డ్రాగన్ ఈ ప్రాంతంలో తరచుా ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. ఈ ప్రాంతాలు తమవేనని వాదించడం, దేశచి త్రపటంలో తమవేనని పేర్కొనడం, సైనికులు చొరబాట్లకు దిగడం వంటివి దాదాపు నిత్యకృత్యమవుతున్నాయి. సిక్కిం సరిహద్దులో భూటాన్, ఉత్తరాఖండ్ సరిహద్దులో నేపాల్ ఉండటంలో ఆయా దేశాలను రెచ్చగొడుతోంది. 2017 సిక్కిం సరిహద్దులోని ‘డొక్లా ‘ వద్ద చైనా సృష్టించిన వివాదం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో భుాటాన్ గట్టిగా భారత్ వైపు నిలబడటం, అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణంగా చైనా వెనక్కు తగ్గింది. తాజాగా ఉత్తరాఖండ్ సరిహద్దులోని కాలాపానీ, తదితర ప్రాంతలు తమవేనని హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ వాదనకు దిగుతోంది. చైనా దన్ను చుాసే ఖాట్మండు ఈ వితండ వాదనకు దిగుతున్నది బహిరంగ రహస్యం.

బలగాలను పెంచుతూ…..

ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో తరచూ చొరబాట్లకు దిగే చైనా ఇప్పుడు సిక్కిం పై దృష్టి సారించింది. అరుణాచల్ ప్రదేశ్ కన్నా సిక్కిం వ్యూహాత్మకంగా కీలకపాత్ర కావడమే ఇందుకు కారణం. లడ్ హాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడిగల పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ వద్ద చైనా ఇటీవల తన బలగాలను భారీగా పెంచుతోంది. ఈ నెల మెుదటి వారంలో లడ్డాఖ్, ఉత్తర సిక్కిం ప్రాంతంలో రెండు దేశాల జవాన్లు రాళ్ళదాడికి దిగారు. ఇరుదేశాల సైనికులు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరుదేశాలకు చెందిన దాదాపు వందమంది గాయపడ్డారు. అప్పటినుంచి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చైనా దాదాపు వందసైనిక గుడారాలను ఏర్పాటు చేసింది. బంకర్ల నిర్మాణం కోసం యంత్రాలను రప్పించింది. పాంగాంగ్ సరస్సు వద్ద కుాడా ఇదే పరిస్ధితినెకొంది. దీంతో భారత్ కూడా బలగాలను పెంచింది. సైన్యాధిపతి జనరల్ ఎమ్.ఎమ్.నరవణె లడ్డాఖ్ ప్రాంతాన్ని సందర్శించి పరిస్ధితిని సమీక్షించారు. సున్నిత ప్రాంతాలైన డెయ్ బోక్, దౌలత్ చేగ్ ఓల్డీ, గాల్వాన్ నది, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో చైనా హెలికాష్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు ప్రతిగా భారత్ యుద్ధ విమానాలు కుాడా గగనతలంలో విహరిస్తుా పరిస్ధితిని అంచనా వేస్తున్నాయి. నిత్యం సమీక్షిస్తున్నాయి.

అధిక నిధులు కేటాయించి…..

తాజాగా భారత్ కు చెందిన కొందరు జవాన్లను చైనా నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ గస్తీ బృందాన్ని చైనా బలగాలను నిర్బంధించినట్లు సంబందిత వర్గాలను ఉటంకిస్తుా ఓ వార్తా ఛానెల్ పేర్కొంది. నిర్బంధానికి గురైన వారిలో సైనికులతోపాటు, ఇండో టిబేట్ బార్డర్ పోలాన్ సిబ్బంది కుాడా ఉన్నట్లు చెబుతున్నారు. తరువాత విడుదల చేశారు. అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి, భారత్ ను దృష్టిలో పెట్టుకుని ఇటీవల చైనా తన రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచింది. గత ఏడాదితో పోలిస్తే ర్క్షక్షణరంగానికి 6.6 శాతం కేటాయింపులు పెంచింది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రు.13.59 లక్షల కోట్లను కేటాయించింది. ఇది భారత రక్షణ బడ్జెట్ కన్నా దాదాపు ముాడురెట్లు అధికం కావడం గమనార్హం. భారత్ పక్కలో బల్లెంగా మారేందుకు బీజింగ్ ప్రయత్నిస్తుందనడానికి ఇంతకు మించిన మరోనిదర్శనం అక్కరలేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News