పిచ్చి వ్యూహాలు.. మెంటల్ నిర్ణయాలు…?

అసలే అది మోదీ, అమిత్ షాల ఇలాకా. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి వ్యూహరచన చేయాలి? కానీ కాంగ్రెస్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో తనకు అనుకూలంగా [more]

Update: 2021-03-07 18:29 GMT

అసలే అది మోదీ, అమిత్ షాల ఇలాకా. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి వ్యూహరచన చేయాలి? కానీ కాంగ్రెస్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో తనకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును దూరం చేసుకుంటుంది. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ డొల్లతనం మరోసారి బయటపడింది. సామాజిక వర్గాలను ఆకట్టుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమయింది. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడే అవకాశముంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో…..

గుజరాత్ కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీ చేతుల్లోనే ఉంది. మోదీ, అమిత్ షా ల సొంత రాష్ట్రం కావడంతో అక్కడి ప్రజలు కూడా బీజేపీకే జై కొడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజారాత్ లోకాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ కు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. గుజరాత్ లో అధికారంలోకి రాలేకపోయినా మోడీని మూడు చెరువల నీళ్లు తాగించామన్న సంతృప్తి కాంగ్రెస్ నేతలకు దేశ వ్యాప్తంగా మిగిలింది.

ఆయన మరణం తర్వాత….?

ఆ తర్వాత సరైన నాయకత్వం లేకపోవడంతో వరసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోతున్నారు. అయినా అధినాయకత్వం గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఉన్నంత వరకూ కొంత అక్కడ పార్టీని కంట్రోల్ లో ఉంచేవారు. కానీ ఆయన మరణం తర్వాత పార్టీ పూర్తిగా పెద్దదిక్కు కోల్పోయిందంటున్నారు. ఇక తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పాటీదార్లను కాంగ్రెస్ దూరంకావడానికి పార్టీ నేతలే కారణమంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో….

గుజరాత్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా సూరత్ లో కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీపార్టీ ఎక్కువ స్థానాలను సాధించింది. కాంగ్రెస్ ఇక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. పాటీదార్లకు టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్లనే ఆ సామాజికవర్గం కాంగ్రెస్ కు దూరమయింది. ఆమ్ ఆద్మీపార్టీకి పాటీదార్లు చేరువయ్యారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలు ముందు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు ముందు చూపులేక ఒక బలమైన సామాజికవర్గం మద్దతు కోల్పోయారంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన పనితీరు మార్చుకోకుంటే గుజరాత్ లో మరోపార్టీ రెండోస్థానంలోకి రాక మానదు.

Tags:    

Similar News