Congress : ఎత్తుగడ ఫలిస్తే ఓకే… కానీ ఆ నష్టం?

పంజాబ్ లో ఎన్నికల ముందు వేసిన ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. అమరీందర్ సింగ్ ను తప్పించి ఆయన స్థానంలో దళిత వర్గానికి చెందిన [more]

Update: 2021-09-24 16:30 GMT

పంజాబ్ లో ఎన్నికల ముందు వేసిన ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. అమరీందర్ సింగ్ ను తప్పించి ఆయన స్థానంలో దళిత వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ చన్నీని నియమించారు. ఎస్సీ వర్గానికి ఆకట్టుకునేందుకే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందని చెప్పుకోవాలి. ప్రధాన సామాజికవర్గం ఎటూ తమవైపు ఉంటుందన్నది కాంగ్రెస్ అంచనా. పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి ముఖ్యమంత్రి మార్పు జరిగిదంటున్నారు.

మెజారిటీ వర్గం….

పంజాబ్ లో సిక్కు వర్గానికి చెందిన 58 శాతం మంది తమవైపే ఉంటారన్నది కాంగ్రెస్ అంచనా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారంతా ఉద్యమం చేస్తున్నారు. అంటే వీరు బీజేపీ వైపు చూడరు. అకాలీదళ్ కూడా ఇక్కడ క్రమంగా పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలో సిక్కులంతా తమ వైపు ఉంటారని, అమరీందర్ ను తప్పించినా పెద్దగా నష్టమేమీ ఉండదని కాంగ్రెస్ ముఖ్యమంత్రి మార్పునకు పూనుకుంది.

పార్టీలో విభేదాలు….

అయితే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ , పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సిద్ధూ కారణంగానే ఎమ్మెల్యేలు తనపై తిరుగుబాటు బావుటా ఎగరేశారని అమరేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పనిలో పనిగా రాహుల్, ప్రియాంకలపై ఆయన విమర్శలు చేశారు. సిద్ధూను ముఖ్యమంత్రిని చేస్తే దేశ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంకలకు రాజకీయ అవగాహన లేదని, వారిని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

నష్టం జరగకుండా…?

కానీ అమరీందర్ పార్టీని వీడతారా? లేదా? అన్నది సస్పెన్స్ గానే ఉంది. కాంగ్రెస్ లో ఉన్నా తనకు ఇక ప్రాధాన్యత లభించదని ఆయనకు స్పష్టమయింది. ఇప్పటికే ఆయనకు బీజేపీ నుంచి ఆహ్వానం ఉంది. కానీ బీజేపీలో చేరేందుకు మాత్రం అమరీందర్ ఇష్టపడటం లేదు. పంజాబ్ లో మెజారిటీ వర్గం బీజేపీని వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. అమరీందర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టమే. అమరీందర్ ను బుజ్జగించి ఎన్నికలకు వెళతారా? లేక లైట్ గా తీసుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News