uttarpradesh cogress : మళ్లీ అవకాశం ఇస్తారా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్యనే ఉండనుంది. రాబోయే ఐదు నెలల్లో రాజకీయ [more]

Update: 2021-09-17 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్యనే ఉండనుంది. రాబోయే ఐదు నెలల్లో రాజకీయ సమీకరణాలు మారితే చెప్పలేం కాని, ప్రస్తుతానికయితే బీజేపీకి ప్రత్యామ్నాయం యూపీలో సమాజ్ వాదీ పార్టీయేనని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చేయాలి? ఒంటరిగా పోటీ చేయాలా? లేక పొత్తులతో వెళ్లి కొద్దో గొప్పో సీట్లను గెలుచుకోవాలా? అన్నది ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది.

తిరిగి దరి చేరతాయా?

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇది కొంతవరకూ పార్టీకి ప్రయోజనం చేకూర్చేదే. ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గం ఓటర్లను తిరిగి రాబట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పడింది. కొన్నాళ్ల క్రితం వరకూ బ్రాహ్మణ సామాజికవర్గం కాంగ్రెస్ వెంట ఉండేది. అయితే ఆ ఓట్లను బీజేపీ తన్నుకుపోయింది. తిరిగి రాబట్టుకునేందుకు యూపీ బాధ్యుడిగా అదే సామాజికవర్గం నేతను ఎంపిక చేయాలన్న ఎత్తుగడలో కాంగ్రెస్ ఉంది.

పెద్దగా ప్రయోజనం ఉంటుందా?

ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా పెద్దగా ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. యూపీలో ప్రధాన సామాజికవర్గాలైన బ్రాహ్మణ, మైనారిటీ వర్గాల ఓట్లను కాంగ్రెస్ కోల్పోయి చాన్నాళ్లయింది. వాటిని ఈ పరిస్థితుల్లో వెనక్కు రప్పించుకోవడం అంత సులువు కాదు. అధికారంలోకి వస్తుందన్న ఛాన్స్ ఉంటే ఓట్లు టర్న్ అవుతాయి. కానీ కాంగ్రెస్ కు ఉత్తర్ ప్రదేశ్ లో అలాంటి అవకాశాలు లేవు.

బీజేపీకి లాభం చేకూరకుండా?

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకే లాభిస్తుంది. బీహార్ తరహాలో తక్కువ స్థానాలతోనైనా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరించి మరోసారి పొత్తుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అప్పుడే ఓట్లు చీలిపోకుండా బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించే వీలుంటుంది. మరి కాంగ్రెస్ ఏ స్ట్రాటజీ తీసుకుంటుందన్నది ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News