రైల్వే నిర్లక్ష్యానికి పరాకాష్ట

పనికిరాని భోగీలు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాల కైనా దారితీసే నిలువెత్తు నిర్లక్ష్యం వెరసి ఇండియన్ రైల్వే గా మారింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల నడుమ నడిచే రైళ్లు [more]

Update: 2019-02-08 07:00 GMT

పనికిరాని భోగీలు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాల కైనా దారితీసే నిలువెత్తు నిర్లక్ష్యం వెరసి ఇండియన్ రైల్వే గా మారింది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల నడుమ నడిచే రైళ్లు మరింత ఘోరంగా నిర్వహిస్తుంది రైల్వే శాఖ. ఎలుకలతో కూడిన ఏసీ భోగీలు ఇక్కడ స్పెషల్ అంటే ఇక స్లీపర్ జనరల్ భోగీలు ఎలా వుంటాయో ఏ మాత్రం చెప్పక్కర్లేదు. బొద్ధింకలు, అనేక జీవాలు రైలు బోగీలను తమ స్థావరాలను చేసుకుని రాజ్యం ఏలుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ముఖ్యంగా ఎలుకలు తిరుగాడే బోగీల్లో ఎప్పుడు ఏ వైర్ ను అవి కోరుకుతాయో తెలియదు. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఏసీలు, లైట్లు , ఫ్యాన్లు పాడౌతున్నాయి. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రయాణికుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఎన్నో ప్రమాదాలు నేర్పిన పాఠాలు మాత్రం నేర్చుకోకుండా రైల్వే నేరపూరిత నిర్లక్యం ఇంకెన్నాళ్ళు భరించి సాగాలన్న ప్రయాణికుల ప్రశ్నలకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది ?

తాజాగా తిరుమల ….

ఆ మధ్య పూర్తి ఏసీ కోచ్ లతో నడిచే ఎపి ఎక్స్ప్ ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అదృష్టం కొద్ధి దాన్ని సకాలంలో గుర్తించి ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. సరిగ్గా అలాగే తాజాగా విశాఖపట్నం నుంచి తిరుపతి వెళుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్ బి 1 బి 2 భోగీలు షార్ట్ సర్క్యూట్ కి గురయి మంటలు చెలరేగాయి. ఏసీ మిషన్ ల నుంచి మంటలు వస్తుండటాన్ని గుర్తించిన ప్రయాణికులు రైలు డ్రైవర్ ను అప్రమత్తం చేసి బండిని నిలుపు చేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. నూజివీడు సమీపంలో ఈ ప్రమాదం జరిగిన తరువాత తాత్కాలికంగా మరమ్మత్తులు జరిపి రైలును విజయవాడ తరలించి బాగు చేసి ప్రయాణం కొనసాగించారు అధికారులు. పనికిమాలిన భోగీలతో రైళ్లను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటాన్ని ఇప్పటికైనా ఆ శాఖ గుర్తించి చర్యలు చేపట్టాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మంద చర్మం తో వున్న రైల్వే శాఖ మేల్కొంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News