ఎవరి ఓటమికి కారణమవుతారో?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు కావడంతో అసంతృప్తి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న పార్టీలు తమకు పట్టున్న [more]

Update: 2021-02-17 17:30 GMT

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు కావడంతో అసంతృప్తి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న పార్టీలు తమకు పట్టున్న ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించాయి. ఎలాగోలా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కాలుమోపాలని చూస్తున్నాయి. వాటి వ్యూహం కరెక్టే గా అమలయితే మమత బెనర్జీకి ఇబ్బందులు తప్పవు. మరోవైపు పోటీ మాత్రం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యనే ఉంది.

ద్విముఖ పోటీ అయినా….

ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాల కూటమి అంతగా ప్రభావం చూపే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీలు కలసి 193 అసెంబ్లీ స్థానాల్లో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఆ రెండు పార్టీ యాభైకి మించి విజయం సాధించడం కష్టమేనన్న లెక్కలు విన్పిస్తున్నాయి. ఇక్కడ తృతీయ ప్రత్యామ్నాయం అంటూ ఏదీ లేకుండా పోయింది. ద్విముఖ పోటీయే జరుగుతుందన్నది మాత్రం వాస్తవం. అందుకే పశ్చిమ బెంగాల్ పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

జార్ఖండ్ పార్టీలు…..

ఇక జార్ఖండ్ పార్టీల ప్రభావం కూడా ఎక్కువగా కన్పిస్తుంది. దాదాపు 30 శాతం ఓటు బ్యాంకు ఎస్సీ, ఎస్టీలవి ఉండటంతో ఆ రాష్ట్రానికి చెందిన పార్టీలు పశ్చిమ బెంగాల్ లో ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఇక్కడ నలభై స్థానాల్లో పోటీకి దిగనుంది. మరోవైపు అదే రాష్ట్రానికి చెందిన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) కూడా ఇక్కడ పోటీకి సై అంటుంది. జార్ఖండ్ లో ఏజేఎస్‍యూ మిత్రపక్షంగా కొనసాగుతుంది.

గిరిజనులు ఎక్కువగా ఉన్న…..

ఈ రెండు పార్టీలూ గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైనే కసరత్తు చేస్తున్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఝాడీగ్రామ్, పశ్చిమ మేదినీపూర్, బంకూరా, పురూలియా, బంకురా, ఈస్ట్ అండ్ వెస్ట్ బర్ధమాన్, వీర్ భూం జిల్లాల్లోనే జేఎంఎం, ఏజేఎస్‌యూ లు పోటీ చేయడానికి సిద్ధ మవుతున్నాయి. ఈ రెండు పార్టీలూ ఈ ఎనిమిది జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతాయం టున్నారు. కొన్ని చోట్ల గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తం మీద సరిహద్దు రాష్ట్రమైన జార్ఖండ్ కు చెందిన పార్టీలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరి ఓటమికి కారణమవుతాయో చూడాలి.

Tags:    

Similar News