పవన్ కి జేడీ లక్ష్మీ నారాయణ ఝలక్ ఇస్తారా ?
జేడీ లక్ష్మీ నారాయణ . ఇంటి పేరేంటో కానీ జేడీయే పేరుగా చేసుకుని రాజకీయంగా దున్నేయాలనుకుని వస్తే సీన్ రివర్స్ అయింది. విశాఖలో అనూహ్యంగా కాలుమోపి జనసేన తరఫున [more]
జేడీ లక్ష్మీ నారాయణ . ఇంటి పేరేంటో కానీ జేడీయే పేరుగా చేసుకుని రాజకీయంగా దున్నేయాలనుకుని వస్తే సీన్ రివర్స్ అయింది. విశాఖలో అనూహ్యంగా కాలుమోపి జనసేన తరఫున [more]
జేడీ లక్ష్మీ నారాయణ . ఇంటి పేరేంటో కానీ జేడీయే పేరుగా చేసుకుని రాజకీయంగా దున్నేయాలనుకుని వస్తే సీన్ రివర్స్ అయింది. విశాఖలో అనూహ్యంగా కాలుమోపి జనసేన తరఫున జేడీ పోటీ చేస్తారని బహుశా ఆయన కూడా వూహించి ఉండరు. నిజానికి ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ సర్వీస్ ఉండగానే తొందరపడి రాజకీయల్లోకి జేడీ రావడం ఓ తప్పిదం అనే వారూ ఉన్నారు. ఏపీలో మద గజల్లాంటి రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ ఉండగా ఇంకో వైపు సినీ గ్లామర్ తో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపధ్యమది. దాంతో జేడీ ఎన్నో విధాలుగా ఆలోచించుకుని చివరికి సొంత పార్టీ ఆలొచన విరమించుకున్నారు. ఆ తరువాత లోక్ సత్తా, టీడీపీ వంటి పార్టీల్లో చేరుతారని ప్రచారం జరిగినా ఎవరూ అనుకోని రీతిలో ఆయన జనసేన జెండా కప్పుకున్నారు.
మంచి పరుగులే నమోదు :
ఇదిలా ఉండగా విశాఖ బరిలో పోటీకి దిగిన జేడీ లక్ష్మీనారాయణ పట్టుపని పది రోజులు కూడా గట్టిగా ప్రచారం చేయలేకపోయారు. సమయాభావం వల్ల ఆయన చాల చోట్ల అసలు తిరిగే లేదు. అయినా సరే ఆయనకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, నిజాయతీపరుడు అన్న ట్యాగ్ బాగా ఉపయోపడ్డాయి. దాంతో ఆయన ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పోయించారు. ఏకంగా రెండు లక్షల 80 వేల పై చిలుకు ఓట్లను కొల్లగొట్టారు. ముందు నుంచి క్రమ పద్ధతిలో ప్రచారం చేసి ఉంటే ఆయన గెలిచేవారన్న అభిప్రాయం కూడా వచ్చింది. సరే ఎన్నికల్లో ఆయన ఓటమి సంగతి ఎలా ఉన్నా బలమైన నాయకుడుగా మాత్రం రాజకీయ పార్టీల ద్రుష్టిలో పడ్డారు. ఈ నేపధ్యంలో ఆయన్ని సంప్రదించేందుకు
బీజేపీ రెడీ అవుతోందని అంటున్నారు.
కమలం నీడకేనా :
జేడీ లక్ష్మీ నారాయణ ఐపీఎస్ అధికారి. మహారాష్ట్ర క్యాడర్ పోలీస్. ఆయనకు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో మంచి పరిచయాలే ఉన్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర బీజేపీ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జేడీ కూడా రాజకీయంగా సరైన వేదిక కోసం చూస్తున్నారని అంటున్నారు. ఆయన విజన్ పూర్తిగా వేరు. జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీలో చేరితే అన్ని విధాలుగా తన ఎదుగుదలకు ఉపయోగంగా ఉంటుందని జేడీ తలపొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీకి కూడా రాయలసీమతో పాటు, ఏపీ వ్యాప్తంగా పరిచయం ఉన్న నాయకుడు, ముఖ్యంగా కాపు సామాజికవర్గం నేత. యువతను ఆకట్టుకునే డైనమిక్ లీడర్ గా పేరున్న జేడీ కనుక పార్టీలోకి వస్తే ఏపీలో బాగా పుంజుకుంటామన్న అంచనా వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జేడీని ముందు పెట్టుకుని పార్టీని బలోపేతం చేసుకోవచ్చునని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఇటు జేడీకి అటు బీజేపీకి ఉభయతారకం ఈ చేరిక కాబట్టి తొందరలోనే కాషాయ దళంలో జేడీ చేరిపోవచ్చునని బలంగా టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే పవన్ కి జేడి మార్క్ ఝలక్ గట్టిగానే తగులుతుందంటున్నారు.