ఇక్కడ ఇప్పట్లో ఎన్నికలు లేనట్లేనా ? రీజన్స్ ఇవేనా ?

చారిత్రక రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికల అంశం మరోసారి చర్చనీయంగా మారింది. కార్పొరేషన్ లో గ్రామాల విలీనం చేసి గ్రేటర్ రాజమండ్రి గా చేయాలని జగన్ ప్రభుత్వం [more]

Update: 2021-08-28 08:00 GMT

చారిత్రక రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికల అంశం మరోసారి చర్చనీయంగా మారింది. కార్పొరేషన్ లో గ్రామాల విలీనం చేసి గ్రేటర్ రాజమండ్రి గా చేయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దీనిపై కొందరు కోర్టు కి వెళ్లారు. ఆ కేసు కోర్టు లో ఇంకా నడుస్తూ ఉండటంతో తుది తీర్పు తరువాత నిర్ణయం తీసుకోవాలని సర్కార్ మొన్నటి స్థానిక ఎన్నికలతో కలిపి ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తరువాత ఏపీ లో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో వైసిపి ఫ్యాన్ రయ్యిన తిరిగి విపక్షాల దిమ్మతిరిగింది.

అదే స్పీడ్ తో మిగిలినవి …

ఈ ఉఫు లోనే రాష్ట్రంలో మిగిలి ఉన్న కొన్ని కార్పొరేషన్ లతో కలిపి ఎన్నికలు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టాక నిర్వహిస్తారన్న సంకేతాలు అందాయి. కార్పొరేషన్ అధికారులు డివిజన్ల విభజన రిజర్వేషన్ల ఖరారు చేయడంతో ఏ సమయంలో అయినా ఎన్నికల నగారా మ్రోగుతుందనే అంతా భావించారు. అందుకు అన్ని పార్టీలు కరోనా కేసులు తూర్పుగోదావరి లో ఎక్కువగా నమోదు అవుతున్నా ప్రజలకు సేవా కార్యక్రమాలతో దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెట్టాయి. కానీ జగన్ సర్కార్ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అంశంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

నామినేటెడ్ తో సరిపెట్టేస్తారుట …

ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పదవుల పండగ నిర్వహించారు. ఇందులో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు చెందిన చందన నాగేశ్వర్ కు స్మార్ట్ సిటీ చైర్మన్ గా, రుడా ఛైర్మెన్ గా మేడపాటి షర్మిలా రెడ్డి ని, నియమించారు. వీరిద్దరి నేతృత్వంలో పాలన లాగించేస్తారని అందువల్ల థర్డ్ వేవ్ విషయం కూడా తేలేవరకు ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించే ఆలోచన అధినేతకు లేనట్లే అంటున్నారు. ఇదే రీతిలో గడువు పూర్తి అయ్యి ఎన్నికలు నిర్వహించాలిసిన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా గిరజాల రామకృష్ణ తులసి ని ప్రకటించేశారు. ఆకుల వీర్రాజు కు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ ను చేసేసారు. వాస్తవానికి ఎన్నికలు రాజమండ్రి కార్పొరేషన్ కి నిర్వహించే ఆలోచన వుండే పక్షంలో అవి పూర్తి అయి ఫలితాలను బట్టి పార్టీ లీడర్స్ పనితీరు ప్రాతిపదికగా నామినేటెడ్ పదవులు జగన్ ఇచ్చేవారు. కానీ ఇప్పట్లో ఎన్నికలను పెట్టడం ఇష్టం లేకే ఈ నాయకులు అంతా లాటరీ కొట్టారనే టాక్ వినవస్తుంది.

Tags:    

Similar News