ఆ మాజీ మంత్రి శకం ముగిసినట్లే ?

నిజానికి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీదనే ఇపుడు తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. అధినేత చంద్రబాబు వయసు డెబ్బై దాటింది. కొడుకు లోకేష్ ఏ విధంగానూ అందుకు రాలేదు. సార్వత్రిక [more]

Update: 2020-04-27 14:30 GMT

నిజానికి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీదనే ఇపుడు తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. అధినేత చంద్రబాబు వయసు డెబ్బై దాటింది. కొడుకు లోకేష్ ఏ విధంగానూ అందుకు రాలేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ కాల పరిమితి ఉంది. అప్పటిదాకా పార్టీని నా ప్రాణం అని భావించి నడిపే నాయకుడు దివిటీ పెట్టి వెతికినా దొరకడంలేదు. ఇక పనిచేద్దామని ఉన్న నాయకులను సైడ్ చేస్తూ పార్టీలో బోలేడు రాజకీయం జరుగుతోంది. ఇంకో వైపు చంద్రబాబు సైతం కొందరు నాయకులు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నారని బాధ సీనియర్లలో ఉంది. మొత్తం మీద చూసుకుంటే నిరాశాపూరిత వాతావరణం పార్టీలో ఉంది.

ఆమెకు చెక్ ….

శ్రీకాకుళం జిల్లా ఒకపుడు టీడీపీకి పట్టు. అక్కడ జనానికి సైకిల్ గుర్తు మాత్రమే దశాబ్దాల కాలంగా తెలుసు. ఎపుడైతే వైఎస్సార్ కాంగ్రెస్ లో నంబర్ వన్ నాయకుడు అయ్యాడో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఒక్కసారిగా పెరిగింది. ఆ తరువాత వైసీపీకి కూడా జనం టర్న్ అయ్యారు. నిన్నటి ఎన్నికల్లో సైతం ఫ్యాన్ గిర్రున తిరిగింది. అచ్చెన్నాయుడు. బెందాళం అశోక్ ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా నెగ్గారు. ఇక ఎంపీగా కింజరపు రామ్మోహన్నాయుడు గెలిచారు. ఈ క్రమంలో జిల్లాలో అచ్చెన్న ఫ్యామిలీ హవా బాగా ఎక్కువగా ఉంది. దాంతో రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ పీఠం మీద నుంచి మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషను పక్కన పెడతారని అంటున్నారు.

అపుడే అలా….

ఇక మూడేళ్ళ క్రితం అంటే 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని గౌతు శ్యామ సుందర శివాజీ ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆయనకు పదవి రాకపోవడంతో ఏకంగా మీడియా ముందు కళ్ళ నీళ్ళపర్యంతం అయ్యారు. ఆ తరువాత ఆయన తన రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తం అనేశారు కూడా. ఇక వారసురాలిగా కుమార్తెను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు. అది జరగలేదు. ఇక జిల్లా అధ్యక్షురాలిగా కూడా ఆమెను ఉండనీయరని తెలుసుకుని గౌతు అనుచరులు తల్లడిల్లుతున్నారు. మొత్తానికి బీసీల నేత గౌతు లచ్చన్న వారసత్వాన్ని కొనసాగించకుండా టీడీపీలోనే కొన్ని శక్తులు బ్రేక్ వేస్తున్నాయని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.

కూనకేనా …?

ఇక శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ పదవిని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కూన అచ్చెన్నాయుడుకు సన్నిహితుడు కావడంతో ఆయన తన మాటను నెగ్గించుకుంటారని అంటున్నారు. ఇక సిక్కోలులో మరో వర్గంగా ఉన్న కళా వెంకటరావు కూడా ఈ మధ్య తగ్గిపోయారు. దాంతో అన్నీ అచ్చెన్న చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. ఇక చంద్రబాబు సైతం పార్టీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు.దాంతో ఆయన ఎటువంటి సెంటిమెంట్లను పెట్టుకోవడంలేదుట. మొత్తానికి ఈ పరిణామాలతో గౌతు ఫ్యామిలీ రాజకీయ తెర నుంచి దూరమవుతుందా అన్నది చర్చగా ఉంది.

Tags:    

Similar News