తుమ్మలకు తూచ్ చెబుతారా…?
మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కీలక నేతగా చక్రం తిప్పిన [more]
మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కీలక నేతగా చక్రం తిప్పిన [more]
మాజీ మంత్రి, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కీలక నేతగా చక్రం తిప్పిన తుమ్మల.. మళ్లీ ఓ వెలుగు వెలుగుతారా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుమ్మల నాగేశ్వర్రావు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. కమ్మ సామాజికవర్గానికి ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కలేదు. త్వరలోనే ఆ వర్గానికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్న నేపథ్యంలో ఆ పదవి తుమ్మలను వరిస్తుందా… లేదా అనేది ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఓడినా మంత్రిని చేసి…..
టీడీపీలో సుధీర్ఘ రాజకీయ అనుభవం గల తుమ్మల నాగేశ్వర్‌రావు 2014 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీచేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే తనతో ఉన్న స్నేహం, అనుబంధం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తుమ్మలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, మంత్రిని చేశారు. ఎంతో కీలకమైన రోడ్లు, భవనాల శాఖను ఆయనకు కట్టబెట్టారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఆ స్థానం నుంచి విజయం సాధించారు.
ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు….
అయితే 2018 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ, అనూహ్యంగా పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో కేవలం ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడి నుంచి గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్ ఒక్కరే జిల్లాలో టీఆర్ఎస్ కు ఏకైక ఎమ్మెల్యేగా ఉండేవారు. అనంతరం కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల చేరికతో పార్టీ బలం కొంత పుంజుకుంది. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటులేకపోవడంతో ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట.
ఐదుగురిని పక్కన పెట్టి…..
ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద ఐదుగురు ఎమ్మెల్యేలు కమ్మ సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి నుంచి అరికెపూడి గాంధీ, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి నల్లమోతు భాస్కర్ రావు, ఆదిలాబాద్‌లోని సిర్‌పూర్ నుంచి కోనేరు కోనప్ప, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. అయితే ఈ ఐదుగురిని పక్కనబెట్టి, తనకు అత్యంత సన్నిహితుడైన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారా.. లేదా .. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఓడిన వారికి ఇవ్వనని….
ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మంత్రి పదవులు లేవని చెప్పడంతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు బెర్త్ కష్టమే ? అన్న టాక్ కూడా ఉంది. ఈ ఈక్వేషన్స్‌లో తుమ్మలకు మంత్రి పదవి కష్టంగానే ఉన్నా తుమ్మలకు బాగా కావాల్సిన వ్యక్తి కావడంతో ఈ ఒక్క విషయంలో మినహాయింపు ఉంటుందా ? లేదా ? తుమ్మలకు మరో పదవితో సరిపెట్టేస్తారా ? అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికల్లో ఓటమితో తుమ్మలకు జిల్లాలో రాజకీయంగా పట్టు అయితే తగ్గిందనే చెప్పాలి.