స్పీకర్ చలవ ఉంటే చాలు మరి …?

పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చి రాజీవ్ గాంధీ గోడదూకుడులకు చెక్ పెట్టినట్లే అని ప్రకటించారు ఒకప్పుడు లోక్ సభలో. ఆయన చట్టం అలా వచ్చిందో లేదో ఆ [more]

Update: 2021-07-02 09:30 GMT

పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చి రాజీవ్ గాంధీ గోడదూకుడులకు చెక్ పెట్టినట్లే అని ప్రకటించారు ఒకప్పుడు లోక్ సభలో. ఆయన చట్టం అలా వచ్చిందో లేదో ఆ తరువాత ఫిరాయింపుల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలో ఉంటూనే ప్రత్యర్థులతో చేతులు కలిపి నేతలు కొత్త దారులు వెతుక్కుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. ఈ చట్టానికి పడినన్ని తూట్లు మరే చట్టానికి లేకాకపోవడం చర్చనీయాశం. చట్టాలు తెచ్చే చట్ట సభ సభ్యులు తల్లి లాంటి పార్టీలకు రొమ్ము గుద్ది మరీ తమకు నచ్చినట్లే నడుచుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తమ వ్యక్తిగత అభివృద్ధికి బాటలు పరుచుకుంటున్నారు. ఈ వ్యవహారాలకు ఏ పార్టీ అతీతం కాదు.

పతాక స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు …

చట్టాల్లో ఉన్న లోపాలను ఉపయోగించడంలో చంద్రబాబును మించిన వారు లేరనే చెప్పాలి. ఏపీ లో గతంలో హయాంలో వైసిపి కి చెందిన 23 మంది ఎమ్యెల్యేలు టిడిపి లోకి అనధికారికంగా దూకేశారు. అంతేకాదు వీరిలో కొందరికి మంత్రి పదవులు సైతం దక్కాయి. నాడు ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో రచ్చ చేసిన జగన్ పార్టీ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టిడిపి ఎమ్యెల్యేలను ఆకర్షించింది. గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ బాటలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు సొంతపార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయకుండా అధికారపార్టీకి జై కొట్టేస్తున్నారు. ఇక తెలంగాణ లో చూసినా కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు ఇలాగే క్యూ కట్టేసి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచేశారు. గులాబీ కండువా దర్జాగా కప్పుకుని ఫిరాయింపులు చట్టం తెచ్చిన తమ పార్టీనే వెక్కిరించేశారు. అలాగే టిడిపి నుంచి రాజ్యసభకు గెలిచిన నలుగురు నేరుగా బిజెపి లో ఆపార్టీని కలిపేసినట్లు ప్రకటించి జై మోడీ అంటూ పోయారు. దీనిపై వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా టిడిపి కి లేకుండా పోయింది.

మేమేం చేయలేం …

తాజాగా పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు చేతులెత్తేసింది. ఈ చట్టంలో ఉన్న ప్రధాన లోపాన్ని ఎత్తిచూపుతూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి విధించాలంటూ సుప్రీం లో కేసు దాఖలు అయ్యింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్పీకర్ లకు ఆవిధంగా కోర్టు లు ఆదేశాలు ఇవ్వడం కానీ లేదా కాలపరిమితి విధించడం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ తీర్పుతో ఇప్పుడు ఏ పార్టీ ముఖ్యంగా విపక్షంలో ఉన్న వారు తమ పార్టీ నుంచి గెలిచిన వారిని కాపాడుకోవడం కష్టమే అన్నది క్లిస్టల్ క్లియర్ అయిపొయింది. ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ అధికారపార్టీ నుంచి స్పీకర్ పదవుల్లోకి వచ్చి కూర్చునే వారిని అభ్యర్ధించడం చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లే అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News