ఓపెన్ చేయాలంటే వణుకుతున్నారు …?

సినిమా థియేటర్లు మూతపడి ఇప్పటికి దాదాపు 7 నెలలు అయ్యింది. ఎట్టకేలకు కేంద్రం వాటి రీ ఓపెనింగ్ కి అనుమతి ఇచ్చింది. అయితే వీటిని తెరిచేందుకు మాత్రం [more]

Update: 2020-10-18 09:30 GMT

సినిమా థియేటర్లు మూతపడి ఇప్పటికి దాదాపు 7 నెలలు అయ్యింది. ఎట్టకేలకు కేంద్రం వాటి రీ ఓపెనింగ్ కి అనుమతి ఇచ్చింది. అయితే వీటిని తెరిచేందుకు మాత్రం సినీ ధియేటర్ యాజమాన్యాలు తూర్పు గోదావరి జిల్లాలో సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరో నెలపాటు థియేటర్లు తెరవకూడదని యజమానులు తీర్మానించుకోవడానికి చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి. దాంతో థియేటర్లు ఎప్పుడు తెరిస్తే వెళ్ళి సినిమాలు చూసేద్దామా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న యువతకు మరికొంత కాలం నిరాశ తప్పేలా లేదు.

సినిమాలు లేకనేనా …?

ప్రస్తుతం థియేటర్లు ప్రారంభిస్తే ఇప్పటికిప్పుడు వచ్చే కొత్త సినిమాలు లేవు. దానికి తోడు నేడు నిర్వహణ వ్యయం అంతా ఇంతా కాదు. ఇది కాక ఏడు నెలలుగా థియేటర్లు మూత పడటంతో వాటిని శుభ్రం చేసుకుని తెరపై బొమ్మ వేయడానికి ఆచితూచి అడుగులు వేయాలి. కరోనా కాలంలో అందరికన్నా ఎక్కువ నష్టపోయిన వర్గాల్లో సినీ జనం ఒకరు. వారిలో ధియేటర్ యజమానుల వేదన అంతా ఇంతా కాదు. ఇప్పటికి సినిమాలు రన్ చేయకపోయినా ట్యాక్స్ లు విద్యుత్ బిల్లులు యధావిధిగా వారు చెల్లించాలిసి వస్తుంది. కొందరు సిబ్బంది కైనా జీతాలు ఇవ్వలేకపోయినా అరకొరగా ఆర్ధిక సాయం చేయాలిసిన పరిస్థితులు. మరో పక్క బుకింగ్ క్లర్క్ ల నుంచి గేట్ మ్యాన్ వరకు ప్రత్యామ్నాయ ఉపాధులకు వెళ్లిపోయారు. ఆ సిబ్బందిని తిరిగి వెతుక్కోవాల్సి ఉంది.

దీపావళికే బొమ్మ …

ఇలాంటి సమస్యలు అన్ని దృష్టిలొ పెట్టుకుని ఎగ్జిబిటర్ లు తూర్పు గోదావరి లో కీలక నిర్ణయం తీసేసుకున్నారు. దీపావళి నుంచి అయితే కొత్త సినిమాల రాక ఉంటుంది కాబట్టి ఈలోగా అన్ని సమస్యలు సర్దుకుని షో లు మొదలు పెట్టాలన్నది వారి ఆలోచన గా ఉంది. ఇవే కాక ప్రస్తుతం ఏపీ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినా వేలల్లోనే నమోదు అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా తూర్పుగోదావరి లో నిత్యం వెయ్యి కేసులు దాదాపు వస్తూ ఉండటం ధియేటర్ యజమానులను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తుంది. క్లోజ్ డ్ గా ఉండే ధియేటర్ లలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే ఎగ్జిబిటర్ లు వెనుకంజ వేసినట్లు సినీ జనం టాక్.

Tags:    

Similar News