జగన్ కు ఆ సిగ్నల్స్ వచ్చాయా? అందుకేనా?

శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఆమోదించే పరిస్థితుల్లో లేనట్లు కన్పిస్తుంది. శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ [more]

Update: 2020-09-06 14:30 GMT

శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఆమోదించే పరిస్థితుల్లో లేనట్లు కన్పిస్తుంది. శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు నాలుగు నెలలు దాటింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలిని వ్యతిరేకించడంతో జగన్ పెద్దల సభను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.

కొద్దిరోజుల్లో పార్లమెంటు సమావేశాలు…..

మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో శాసనమండలి రద్దు అంశం వచ్చే అవకాశమే కన్పించడం లేదు. కరోనా వైరస్ తో పార్లమెంటు సమావేశాల రోజులను కూడా కుదించారు. ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేశారు. పార్లమెంటు, రాజ్యసభలు వేర్వేరు సమయాల్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇన్ని నిబంధనలు ఉండటంతో ముఖ్యమైన బిల్లులు మాత్రమే చర్చకు వచ్చే అవకాశముంది.

తొలినుంచి కేంద్ర ప్రభుత్వం…..

తొలి నుంచి కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దు పట్ల సుముఖంగా లేదు. అనేక రాష్ట్రాల నుంచి రద్దు చేయాలని కొందరు, పునరుద్ధరించాలని మరికొన్ని రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదనను పంపాయి. ఈ ప్రతిపాదనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే యోచనలో ఉంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే శాసనమండలి పై ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రానుంది. దేశం మొత్తం మీద శాసనమండలి విషయంలో ఒకే విధానాన్ని అమలుపర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

పునరాలోచనలో జగన్…?

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు ముఖ్యమంత్రి జగన్ కు వచ్చినట్లు తెలిసింది. అందుకే శాసనమండలి విషయంలో పెద్దగా కేంద్ర ప్రభుత్వాన్ని వత్తిడి చేయకపోవడంతో పాటు ఖాళీ అవుతున్న పోస్టులు సయితం జగన్ భర్తీ చేస్తున్నారు. ఇటీవల ముగ్గురిని శాసనమండలి అభ్యర్థులగా జగన్ ఎంపిక చేశారు. మరోవైపు 2021నాటికి శాసనమండలిలో వైసీపీ బలం పెరుగుతుండటంతో జగన్ రద్దు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలిసింది. శాసనమండలి కధ కంచికి చేరినట్లేనని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News