బాబు విషయంలో కొత్త డౌట్లు

వైఎస్సార్ అంటే చంద్రబాబుకు పడదని రాజకీయం ఆ మాత్రం తెలిసిన అందరూ అంటారు. ఎపుడో మొదట్లో ఇద్దరూ కాంగ్రెస్ లో కలసి ఉన్నా తరువాత మాత్రం దశాబ్దాల [more]

Update: 2019-07-24 03:30 GMT

వైఎస్సార్ అంటే చంద్రబాబుకు పడదని రాజకీయం ఆ మాత్రం తెలిసిన అందరూ అంటారు. ఎపుడో మొదట్లో ఇద్దరూ కాంగ్రెస్ లో కలసి ఉన్నా తరువాత మాత్రం దశాబ్దాల పాటు రాజకీయ వైరం అలా కొనసాగింది. దాని మీద ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ తనకూ వైఎస్ కు వ్యక్తిగత వైరం ఏమీ లేదని, ఆ మాటకు వస్తే తనకు ఆప్తమిత్రుడు వైఎస్ అని నిండు సభక్లో కుండ బద్దలు కొట్టారు. ఒకే మంచం, ఒకే గది అంటూ స్నేహానుబంధాన్ని కూడా గట్టిపరచే ప్రయత్నం చేశారు. ఇక వైఎస్, చంద్రబాబు రాజకీయంగా మరీ ముఖా ముఖీ తలపడింది. 1999 నుంచి 2009 వరకూ, ఈ మధ్యలో చంద్రబాబు సీఎం గా వుంటే వైఎస్ ప్రతిపక్ష నేత. వైఎస్ సీఎం అయితే చంద్రబాబు విపక్ష నేతగా మాటల తూటలే సభల్లో పేలుతూ వచ్చాయి.

వైఎస్ చాలా మంచోడు….

ఇంత పక్కాగా చంద్రబాబు అనకపోయినా దాని అర్ధం, తాత్పర్యం మాత్రం ఇదేనని చెప్పాల్సిందే. పదే పదే వైఎస్ ని చంద్రబాబు తలచుకుంటున్నారు. ఎలా అంటే ఆయన పేరు మీద అధికారంలోకి వచ్చిన వైసీపీతో సాటిగా వైఎస్ జపం చేస్తున్నారు. తాను సీఎం గా ఉండగా హైదరాబాద్ లో కట్టిన ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్టులను వైఎస్సార్ తరువాత కాలంలో కొనసాగించారు తప్ప కూల్చలేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. తన అభివృధ్ధి పనులను వైఎస్ స్వాగతించి కొనసాగించారని చెప్పడం చంద్రబాబు ఉద్దేశ్యం. అదే సమయంలో ఏపీలో మాత్రం జగన్ తాను కట్టిన ప్రజా వేదికను కూల్చారని, రాజధాని అమరావతి మీద సీత కన్ను వేస్తున్నారని కూడా చంద్రబాబు వాపోతున్నారు. దీని అర్ధం పరమార్ధం ఏంటంటే వైఎస్ చాలా మంచివాడు, జగన్ ఆయన కొడుకు అయినా చెడ్డవాడు అని చెప్పడం. ఈ రకమైన సరికొత్త ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోవడమే చంద్రబాబు అసలైన ఎత్తుగడగా ఉంది.

ఆఖరుకు వైఎస్ ని కూడా…..

అన్న నందమూరి తారక రామారావు పార్టీని పెట్టి మూడు సార్లు భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకువస్తే ఆయన్నే దించేసిన చంద్రబాబు మొదట్లో అన్నగారినే విమర్శిస్తూ పబ్బం గడుపుకున్నారు. ఎన్నికల వేళ మాత్రం అన్నగారి చిత్ర పటాన్ని బయటకు తీసి దండలు వేసి ఆయన పేరు మీద ఓట్లు అడగడం చంద్రబాబు నేర్చిన విద్య. ఇపుడు వైఎస్ చరిష్మా ఎంతలా ఉందో చంద్రబాబుకు తాజా ఎన్నికల్లో అర్ధమైంది ఏకంగా ఏపీ అసెంబ్లీని వూడ్చేసిన తరహాలో వైఎస్ ప్రభంజనం వీచింది. చనిపోయినా జనం గుండెల్లో దేవుడైన వైఎస్ ని కూడా చంద్రబాబు రాజకీయంగా ఉపయోగించుకోదలచుకున్నారా అన్న అనుమానాలు ఇపుడు కలుగుతున్నాయి.

ఎల్లో మీడియా ద్వారా…..

మాటిమాటికీ నేను వైఎస్సార్ మిత్రులం, వైఎస్సార్ చాలా మంచి వాడు అని చెప్పడం వెనక పులివెందుల పులిని కూడా తన వైపుకు తిప్పుకోవడం అన్న ఎత్తుగడ దాగుందేమోనన్న కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయి. అదే సమయంలో జగన్ ఆయన తండ్రి వైఎస్ ని వేరు చేస్తూ చూడడం. వైఎస్సార్ గొప్పవాడే కొడుకే ఇలా అంటూ ప్రచారం చేయడం ద్వారా జనంలో జగన్ని పలుచన చేయాలనుకోవడం చంద్రబాబు మరో టార్గెట్. ఇక అనుకూల మీడియా ఈ విషయంలో అపుడే ఓ అడుగు ముందుంది. వైఎస్సార్ మంచివాడే అంటూ ఆయన రాజసం, ఆయన నవ్వు వేరు అన్న తీరులో వర్ణించి మరీ చంద్రబాబుకు భజన చేసే ఓ పత్రిక జగన్ తో పోలుస్తూ రాతలు రాయడం వెనక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. మరి జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడో

Tags:    

Similar News