కలవడం కల్ల అని అంటున్నారే
ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఎలా అంటే ఇక రెండు వర్గాలు కలుసుకోలేని పరిస్థితి తలెత్తింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలు [more]
ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఎలా అంటే ఇక రెండు వర్గాలు కలుసుకోలేని పరిస్థితి తలెత్తింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలు [more]
ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఎలా అంటే ఇక రెండు వర్గాలు కలుసుకోలేని పరిస్థితి తలెత్తింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటండటం ఆసక్తికరంగా మారిది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గాలు ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. ఎమ్మెల్యేపై జలగం కోర్టుకు వెళ్లారని, త్వరలోనే వనమా ఎమ్మెల్యే పదవి పోతుందంటూ సోషల్ మీడియాలో జలగం వర్గం ప్రచారం చేస్తుండటంపై వనమా మర్గం మండిపడుతోంది.
గత ఎన్నికల్లో ఇద్దరూ…..
గత ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులే. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. స్వల్ప ఓట్ల తేడాతోనే జలగం వెంకట్రావు ఓటమి పాలు కావడంతో ఆయన వనమా పై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతుంది. వనమా తన అఫడవిట్ లో అనేక విషయాలు దాచిపెట్టారని జలగం కోర్టుకు వెళ్లారంటున్నారు. సుప్రీంకోర్టులో జలగం సన్నిహితుడొకరు ఈ కేసును వేశారన్న ప్రచారం జరుగుతోంది.
అందుబాటులో లేక…
2014లో గెలిచిన జలగం వెంకట్రావు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా 2018 ఎన్నికల్లో గెలవలేకపోయారు. అయితే జలగం వెంకట్రావు వ్యవహారశైలి వల్లనే ఆయనకు ఓటమి తెచ్చిపెట్టిందనే వారు లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేసినప్పటికీ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరన్న ప్రచారం ఉంది. పెద్దగా ఎవరినీ కలుపుకుని పోరనే వాదన కూడా ఉంది. నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం చేయరన్న టాక్ నియోజకవర్గంలో ఏర్పడటంతో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
రెండు వర్గాల మధ్య…..
టీఆర్ఎస్ లోకి వనమా వెంకటేశ్వరరావు చేరిన తర్వాత జలగం వెంకట్రావు కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారంటున్నారు. దీంతో జలగం అనుచరులు సయితం వనమాను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వనమా, జలగంల మధ్య వివాదానికి కారణమయిందంటు న్నారు. మరోవైపు వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ సెటిల్మెంట్లు చేస్తూ భూదందాలు చేస్తున్నారని కూడా జలగం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కొత్త గూడెం నియోజకవర్గంలో అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు తయారైంది. అధిష్టానం జోక్యం చేసుకోకుంటే పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశముంది.