టీడీపీకి జనసేన సైలెంట్ మద్దతు.. అదిరిపోతున్న స్ట్రాటజీ
అదేంటి ? అనుకుంటున్నారా ? నిజమే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదే ఇప్పుడు తిరుపతిలోనూ తెరమీదకి వస్తోంది. ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తుగా ఉన్న విషయం తెలిసిందే. [more]
అదేంటి ? అనుకుంటున్నారా ? నిజమే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదే ఇప్పుడు తిరుపతిలోనూ తెరమీదకి వస్తోంది. ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తుగా ఉన్న విషయం తెలిసిందే. [more]
అదేంటి ? అనుకుంటున్నారా ? నిజమే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదే ఇప్పుడు తిరుపతిలోనూ తెరమీదకి వస్తోంది. ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు తిరుపతి టికెట్‌ను ఇవ్వాలని జనసేన నాయకుడు కోరుతున్నారు. కానీ, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టికెట్ ఇచ్చే విషయాన్ని ఇవ్వని విషయాన్ని తేల్చకుండా.. లోపాయికారీగా.. తిరుపతిలో సభలు, సమావేశాలు నిర్వహించడం, టికెట్ తమదేనని ప్రచారం చేసుకోవడం తెలిసిందే. దీంతో సహజంగానే బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తూ.. వచ్చిన తమకు ఇది అవమానకరమని.. జనసేన భావిస్తోంది.
లెస్సన్ చెప్పాలని…
ఇక పవన్ కూడా ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా బీజేపీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో తాత్సారం చేయడంపై కూడా జనసేనాని గుర్రుగా ఉన్నారు. అసలు బీజేపీ జనసేనను మిత్రపక్షంగా చూస్తోందా ? అన్న సందేహాలు కూడా జనసేన వాళ్లకే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ తిరుపతి టికెట్ విషయంలో కనుక తమకు అన్యాయం చేస్తే.. తాము కూడా తగిన విధంగా లెస్సన్ చెప్పాలని జనసేన భావిస్తోందని సమచారం. పైకి ఎలాంటి తేడా చూపకుండా.. లోపాయికారీగా. తాము కూడా వ్యవహరించాలని జనసేన నిర్ణయించుకుందని సమాచారం. అంటే.. బీజేపీ నేతను కనుక తిరుపతిలో ప్రకటిస్తే.. తాము ప్రచారానికి దూరంగా ఉండాలని ఇప్పటికే జనసేన నిర్ణయించుంది.
లోపాయికారిగా….
వాస్తవానికి స్వతంత్రంగా అభ్యర్థిని ప్రకటించాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. అయితే ఇలా చేయడం ద్వారా.. బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్న జనసేన.. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే జనసేన ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకునే ప్రతిపాదనను పక్కన పెట్టి.. పాత మిత్రుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే.. టీడీపీ ఎలాగూ ఇక్కడ నుంచి బరిలో నిలిచిన నేపథ్యంలో ఆ పార్టీ కి లోపాయికారీగా సహకరిస్తే.. బెటర్ అనే వాదన జనసేన నుంచి వినిపిస్తోంది.
బీజేపీతో ఒరిగేదేమీ లేదని…..
వాస్తవానికి తాము జట్టుకట్టాల్సింది కూడా టీడీపీతోనేనని.. బీజేపీ వల్ల రాష్ట్రంలో తమకు ఒరిగింది ఏమీ లేదని.. కూడా జనసేన నాయకులు అంటున్నారు. కానీ, బీజేపీ వలలో చిక్కుకుని.. తాము మోసపోయామని కూడా ద్వితీయ శ్రేణి నాయకులు అంటున్నారు. దీంతో తిరుపతి విషయంలో తమకు ఎలాంటి పరాభవం ఎదురైనా.. బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు వెనుకాడేది లేదని.. జనసేన నేతలు చెబుతున్న మాట. మరి జనసేన – బీజేపీ బంధం ఏ తీరాలకు చేరుతుందో ? చూడాలి.