janareddy : జానారెడ్డి పై మళ్లీ వత్తిడి పెరుగుతోందా?

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుటుంబం రాజకీయంగా నిర్ణయం తీసుకోబోతుందా? పార్టీని ఆ కుటుంబం వీడపోతుందా? అంటే అవుననే అంటున్నారు. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక [more]

Update: 2021-10-08 11:00 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుటుంబం రాజకీయంగా నిర్ణయం తీసుకోబోతుందా? పార్టీని ఆ కుటుంబం వీడపోతుందా? అంటే అవుననే అంటున్నారు. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో ఇదే తరహాలో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులు తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్ లేదని భావించడమే మరోసారి ఈ ప్రచారానికి కారణమంటున్నారు. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వత్తిడి తెస్తున్నారని తెలిసింది.

ముఖ్యమంత్రి అవ్వాల్సిన….

జానారెడ్డి తెలంగాణలో సీనియర్ నేత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావవం సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. నిజానికి రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్న వ్యక్తుల్లో జానారెడ్డి ఒకరు. అలాంటి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏమీ కాకుండా పోయారు. 2018 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ జానారెడ్డి సాగర్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడం ఆయన తట్టుకోలేకపోయారు.

వరస ఓటములతో….

తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోని, కాంగ్రెస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని జానారెడ్డి చెప్పారు. అయితే సాగర్ ఉప ఎన్నిక తర్వాత జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అదే సమయంలో జానారెడ్డి కూడా కాంగ్రెస్ కు ఏమాత్రంఉపయోగపడలేదు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమానికి జానారెడ్డికి ఆహ్వానం ఉండటం లేదు. అంటే జానారెడ్డి దాదాపుగా కాంగ్రెస్ రాజకీయాలకు దూరమయినట‌్లే చెప్పుకోవాలి.

కుటుంబ సభ్యులు….

ఇక ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి ప్రస్తుతానికి కాంగ్రెస్ లో యువనేతగా ఉన్నారు. కాంగ్రెస్ కు భవిష‌్యత్ లేదని గ్రహించిన రఘువీర్ రెడ్డి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సాగర్ లోనే తమ కుటుంబం పట్టు నిలుపుకోవాలంటే అధికార పార్టీలో చేరడమే మంచిదని జానారెడ్డి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అధికార పార్టీ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే వెళ్లడానికి సిద్దమంటున్నారు. మొత్తం మీద జానారెడ్డి కుటుంబం ఏ సమయంలోనైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News