Pawan kalyan : అంతా ఇదే చర్చ.. నష్టమేదీ పెద్దగా లేదట
ఆయనకు క్రెడిబులిటీ లేదు. ఈయనకు అకౌంట్ బులిటీ లేదు. ఇద్దరినీ జనం నమ్ముతారా? అన్నదే ప్రశ్న. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన, టీడీపీ పొత్తు గురించే. [more]
ఆయనకు క్రెడిబులిటీ లేదు. ఈయనకు అకౌంట్ బులిటీ లేదు. ఇద్దరినీ జనం నమ్ముతారా? అన్నదే ప్రశ్న. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన, టీడీపీ పొత్తు గురించే. [more]
ఆయనకు క్రెడిబులిటీ లేదు. ఈయనకు అకౌంట్ బులిటీ లేదు. ఇద్దరినీ జనం నమ్ముతారా? అన్నదే ప్రశ్న. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన, టీడీపీ పొత్తు గురించే. అసలు పొత్తు కుదురుతుందా? లేదా? పక్కన పెడితే ఆ పార్టీ నేతల నుంచి ప్రత్యర్థి పార్టీల నేతలు ఆ పొత్తు కారణంగా ఎవరిది గెలుపన్న లెక్కల్లో మునిగిపోయారు. ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. కోస్తాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది.
బాబు హామీలను….
అయితే ఇద్దరు నేతలు కలసి ప్రచారానికి వస్తే ప్రజలు ఆదరిస్తారా? అన్నది కూడా చర్చనీయాంశ మైంది. చంద్రబాబు సుదీర్ఘకాలం ఏపీని పాలించారు. ఆయన ఎటువంటి వారో అందరికీ తెలుసు. ఇచ్చిన హామీని అమలు చేయని పరిస్థితి చంద్రబాబుది. అదే సమయంలో ఉన్న పథకాలను తొలగించే అవకాశం ఉంది. చంద్రబాబు గతంలోనూ ఇదే విధానాన్ని అమలు చేశారు. చంద్రబాబు తాను చేయదలచుకున్న పనులను చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.
పవన్ మనస్తత్వాన్ని….
ఇక పవన్ కల్యాణ్. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అనేక పార్టీలకు మద్దతుగా నిలిచారు. తాను లేకుంటే అవతలి పార్టీ లేదనుకునే మనస్తత్వం ఈయనది. తానొక్కడే క్లీన్ ఇమేజ్ ఉన్నేవాడినని, అవతలి వాళ్లు అవినీతి పరులని భావించే మనస్తత్వం ఆయనది. నిలకడలేని స్వభావం ఉన్న పవన్ కల్యాణ్ ను ప్రజలు ఈసారి కూడా నమ్మే పరిస్థితి ఉంటుందా? అన్నదే సందేహం. ప్రతి ఎన్నికకు జెండాను మార్చే పవన్ కల్యాణ‌్ వెంట జనం నడిచే అవకాశం లేదన్నది కొందరి వాదన.
పది నియోజకవర్గాల్లోనే….
ఇలా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇద్దరూ కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండబోవన్నది వైసీపీ నేతల అంచనా. మహాఅయితే ఒక పది నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉంటుందని, వాటిని గుర్తించి జగన్ ఆ నియోజకవర్గాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీ, జనసేన పొత్తు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అనేక చోట్ల రెండు పార్టీల గుర్తులు, అధినేతల ఫొటోలతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.