జనసేనలో వారి లోటు ఎప్పటికైనా ఇబ్బందే?
రాజకీయాలంటే.. ఓ ఫైర్! రాజకీయాలంటే.. ఓ దూకుడు!! అటు వైసీపీని చూసినా.. ఇటు టీడీపీని చూసినా.. ఆఖరుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేని బీజేపీని చూసినా.. ఫైర్ బ్రాండ్ [more]
రాజకీయాలంటే.. ఓ ఫైర్! రాజకీయాలంటే.. ఓ దూకుడు!! అటు వైసీపీని చూసినా.. ఇటు టీడీపీని చూసినా.. ఆఖరుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేని బీజేపీని చూసినా.. ఫైర్ బ్రాండ్ [more]
రాజకీయాలంటే.. ఓ ఫైర్! రాజకీయాలంటే.. ఓ దూకుడు!! అటు వైసీపీని చూసినా.. ఇటు టీడీపీని చూసినా.. ఆఖరుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేని బీజేపీని చూసినా.. ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేసే నాయకులకు కొదవ లేదు. పార్టీల అధిష్టానాలు వద్దు బాబూ మీరు నోరు విప్పద్దు! అని నెత్తీనోరూ బాదుకున్నా.. ఆగని ఫైర్ బ్రాండ్లు.. రాజకీయ సంచలన వ్యాఖ్యలు చేసే నాయకులు ఈ పార్టీలో లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వారు నోరు విప్పితే.. రాజకీయంగా కుదుపులు.. వారు ప్రెస్‌మీట్లు పెడితే.. కిక్కిరిసిపోయే మీడియా ప్రతినిధులు ఇదీ.. ఆయా పార్టీల రాజకీయాలు. దీనికి కారణం ఏంటి..? మాస్ లీడర్లు ఉండడమే.
ఆ కొరతతోనే….
రాజకీయంగా దేనికైనా తెగించే నాయకులు.. ఏవిషయంపైనైనా అనర్గళంగా వ్యాఖ్యానించే నేతలు వైసీపీ, టీడీపీలకు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో సామాజిక వర్గాల వారీగా కూడా నాయకులు ఉన్నారు. ఇదే తరహా రాజకీయం బీజేపీలోనూ ఉంది. అయితే, ఎటొచ్చీ.. ఇప్పుడు జనసేనలో మాస్ లీడర్ల కొరత చాలా తీవ్రంగా ఉందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. పైగా అత్యంత కీలకమైన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ వంటి వారు.. మౌనమే తన భాషగా.. రెండు మాటలు మాట్లాడితే.. ఎక్కువ.. ఒక మాట మాట్లాడితే.. తక్కువ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ తరఫున గట్టి బలమైన వాయిస్ వినిపించే నాయకులు కనిపించడం లేదు.
అందరూ మేధావులే….
అందరూ మేధావులే.. అయినా ప్రయోజనం ఏముంది? పొలిటికల్‌గా చూసుకున్నప్పుడు జనసేన గ్రాఫ్‌ను పెంచే నాయకులు, రేటింగ్‌ను దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే నాయకులు లేరు. ఎక్కడా పదనునైన విమర్శ కనిపించదు.. ఎక్కడా దూకుడు స్టేట్‌మెంట్ వినిపించదు. మరి ఇలా ఉంటే.. పార్టీ ఎలా ముందుకు సాగుతుంది? కేవలం జనసేనాని పవన్ మాత్రమే మాస్, క్లాస్ ఇమేజ్ రెండూ సంపాయించుకుని ముందుకు సాగుతున్నారు. మరి ఆయన స్థాయి కాకపోయినా.. అంతో ఇంతో పార్టీని ముందుకు నడిపించేలా పట్టుమని ఓ పది మంది మాస్ లీడర్లయినా.. ఉండాలా? వద్దా? అనే చర్చ పార్టీలో సాగుతోంది.
మున్ముందు ఇబ్బందే….
ప్రస్తుతం పోతిన మహేశ్ ఒక్కడే . పార్టీలో తురుపు ముక్కగా కనిపిస్తున్నారు. మరి మిగిలిన వారు మాత్రం.. నిర్మాణాత్మక విమర్శలు అంటూ.. చోద్యం చూస్తున్నారు. అలాగని అభాండాలు వేయమనో.. లేని పోని వ్యాఖ్యలు చేయమనో ఎవరూ అడగరు. కానీ, పార్టీపై ప్రజలు ఆలోచించుకునే రేంజ్‌లో అయినా.. వ్యాఖ్యలు, కార్యాచరణ ఉండాలి కదా! అనేది పార్టీలోనే సాగుతున్న అంతర్గత చర్చ. కానీ, ఇప్పటి వరకు ఈ దిశగా ఎవరూ కార్యాచరణ చేపట్టలేదు. మరి ఈ నేపథ్యంలో మాస్ లీడర్ల కొరత మున్ముందు కూడా పార్టీని వేధిస్తుందనే అంటున్నారు పరిశీలకులు.