Janasena : బరిలోకి దిగుతుంది… గ్యాప్ తగ్గుతుంది

బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ, విపక్ష వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక్కడ ఈ రెండు [more]

Update: 2021-09-29 03:30 GMT

బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ, విపక్ష వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇబ్బంది ఎదుర్కొన్నా బద్వేలు నియోజకవర్గంలో కొన్ని ఎంపీటీసీలను గెలుచుకుంది. దీంతో టీడీపీ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామన్న ధీమాగా ఉంది. అయితే ఇక్కడ జనసేన, బీజేపీ కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

తామే పోటీ చేయాలని…

బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈసారి ఉప ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పోటీ కోసం రెండు పార్టీలూ తామంటే తామేనని పోటీ పడ్డాయి. బీజేపీ, జనసేన పొత్తు ఉండటం, పార్లమెంటు ఎన్నిక కావడంతో జనసేన చివరకు వెనక్కు తగ్గింది.

పెద్దగా బలం లేకపోయినా…

అయితే ఈసారి బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేయనుంది. నిజానికి రాయలసీమ ప్రాంతంలో తిరుపతి తప్ప ఎక్కడా జనసేన, బీజేపీ బలంగా లేవు. తిరుపతి ఉప ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలకు కలిపి పెద్దగా ఓట్లు రాలేదు. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక కావడం, అక్కడ వైసీపీ బలంగా ఉండటంతో ఇక్కడ కనీస ఓట్లు సాధించే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నది సుస్పష్టం. కానీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో బీజేపీ, జనసేన మధ్య ఇటీవల నెలకొన్న గ్యాప్ తొలిగిపోనుంది.

మరోసారి జోష్….

కానీ జనసేన పోటీ చేస్తే సీమ ప్రాంతంలో మరోసారి పార్టీకి జోష్ పెరుగుతుందన్న భావన ఆ పార్టీ నేతల్లో కన్పిస్తుంది. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. అభ్యర్థి ఎవరనేది కడప జిల్లా నేతలతో చర్చించిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారని తెలిసింది. మరోసారి సీమలో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, జనసేన కలసి పోటీ చేయనున్నాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లోనే క్లారిటీ రానుంది.

Tags:    

Similar News