జనసేన ఆ రెండింటిపై గట్టి ఫోకస్ పెట్టిందా ?
ఆంధ్రప్రదేశ్ లో తమ బలం ఎక్కడ ఉందో జనసేనకు మొన్నటి స్థానిక ఎన్నికల్లో క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ప్రధాన పార్టీల [more]
ఆంధ్రప్రదేశ్ లో తమ బలం ఎక్కడ ఉందో జనసేనకు మొన్నటి స్థానిక ఎన్నికల్లో క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ప్రధాన పార్టీల [more]
ఆంధ్రప్రదేశ్ లో తమ బలం ఎక్కడ ఉందో జనసేనకు మొన్నటి స్థానిక ఎన్నికల్లో క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించిందనే చెప్పాలి. ఎక్కువ స్థానాలు గెలవకపోయినా గ్రామాలు పట్టణాల్లో జనసైనికులు హుషారుగా రంగంలోకి దిగి యుద్ధమే చేశారు. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని పంచాయితీలను మునిసిపాలిటీల్లో వార్డు లను జనసేన గెలిచి తమ ఉనికి చాటుకుంది.
బిజెపి నే కాదు టిడిపి కూడా …
చాలా గ్రామాల్లో జనసేన కు టిడిపి లైన్ క్లియర్ చేసేసింది ప్రధాన ప్రతిపక్షం. బలమైన అభ్యర్థి జనసేన వైపు ఉన్న చోట తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడం లేదా బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్ష సహాకారం అందించింది. కాపు సామాజికవర్గ ఓటర్లలో టిడిపి పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడేందుకు తెలుగుదేశం నేతలు ఎత్తులు వేసినట్లు మొన్నటి ఎన్నికలు స్పష్టం చేసేశాయి. బిజెపి తో పొత్తుతో టిడిపి కి జనసేన దూరం గా ఉన్నప్పటికీ రేపటి రోజున ఆ పార్టీతో పొత్తుపై ఇప్పటినుంచి సానుకూల వాతావరణం కోసమే అధినాయకత్వం నుంచి కింది స్థాయి వరకు అంతా ఎదురు చూస్తున్నారు. జగన్ హవా ముందు నిలబడాలంటే పొత్తులతోనే సాధ్యమని పసుపు దళానికి అవగతం అయినట్లే అని తేలిపోయింది.
జోష్ పెంచే పనిలో నేతలు …
ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తరచూ రావడం మొదలు పెట్టారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో పార్టీని చురుగ్గా నడిపించే బాధ్యతలను నాదెండ్ల స్వీకరించినట్లు తెలుస్తుంది. దాంతో ఆయన స్థానిక ఎన్నికల్లో జనసైనికులు చూపిన ఉత్సహం నీరుగారకుండా క్షేత్ర స్థాయిలో వారిని కలుస్తూ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. అందుకే ఇటీవల రాజోలు లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన జనసైనికులకోసం ప్రత్యేకంగా రెండురోజులు ఆయన తూర్పుగోదావరి జిల్లాల్లో నేతలు కార్యకర్తలతో గడిపారు. తమ పార్టీకి పట్టున్న చోట మరింతగా బలపడటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కూడా మిగిలిన చోట్ల గతంకన్నా మిన్నగా క్షేత్ర స్థాయిలో కమిటీలను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. మొత్తానికి పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు గోదావరి జిల్లాలే జనసేన ఆయువు పట్టు అని గ్రహించి పవన్ పార్టీ జనసేన అక్కడ తమ బలం చాటిచెప్పాలన్న ప్రయత్నాన్ని అధికారపార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.