జనసేన సత్తా ఏంటో తెలిసిపోనుందా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ప్రజలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ [more]

Update: 2020-11-20 11:00 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ప్రజలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన, బీజేపీ పొత్తుతోనే ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. బీజేపీ కూడా జనసేనను కలుపుకుని వెళ్లాలని నిర్ణయించింది. మొత్తం 150 డివిజన్లలో బీజేపీ జనసేనకు యాభై డివిజన్లను కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

రాష్ట్రం ఆవిర్భావం తర్వాత…..

జనసేన పార్టీ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జనసేన పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, దుబ్బాక, హుజూర్ నగర్ వంటి ఉప ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు పోటీ చేయాలని పవన్ కల్యాణ్ కు విన్నవించుకున్నా ఆయన పట్టించుకోలేదు. కేవలం ఏపీ రాజకీయాలకే జనసేనను పరిమితం చేశారు.

బీజేపీతో పొత్తుతో…..

ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు. అక్కడ పొత్తు కుదరడంతో తెలంగాణలోనూ కలసి పోటీ చేస్తారని భావించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పవన్ కల్యాణ్ ను కలసి దీనిపై చర్చించారు. కానీ పవన్ కల్యాణ‌్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ పై ప్రశంసలు….

అయితే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత మేరకు పనిచేస్తుందనేది చర్చగా మారింది. ఆయన బలంగా ఉన్న అభిమానులున్న ఏపీలోనే జనసేన గెలవలేకపోయింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పటికీ హైదరాబాద్ నగరంలో జనసేన గెలుపు ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో అనేకసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరంలో జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఈ ఎన్నికల్లో తేలనుంది.

Tags:    

Similar News