అంతకు మించి ఛాన్స్ లేదటగా…!!
అంతకు ముందు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా కర్ణాటకను ఏలిన కాంగ్రెస్ పార్టీకి పెద్దచిక్కొచ్చి పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనతాదళ్ తో పొత్తును అనేక [more]
అంతకు ముందు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా కర్ణాటకను ఏలిన కాంగ్రెస్ పార్టీకి పెద్దచిక్కొచ్చి పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనతాదళ్ తో పొత్తును అనేక [more]
అంతకు ముందు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా కర్ణాటకను ఏలిన కాంగ్రెస్ పార్టీకి పెద్దచిక్కొచ్చి పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనతాదళ్ తో పొత్తును అనేక మంది నేతలు వ్యతిరేకించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ పట్టు సంపాదించుకుంది. పటిష్టమైన క్యాడర్ ఉంది. ఇక అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనేక పథకాలను ప్రవేశపెట్టి మరోసారి సంకీర్ణ ప్రభుత్వమైన అధికార పార్టీగా చూపించగలిగారు. అయితే ఎన్నికల వేళ పొత్తులు క్యాడర్ తో పాటు నేతలకూ ఇబ్బందిగా మారాయి.
దేవెగౌడ పట్టు…..
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య సీట్ల పంపకం తలనొప్పి తెచ్చేలానే ఉంది. జనతాదళ్ ఎస్ కూడా తన బలం ఏమాత్రం తక్కువ కాదని చెబుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత దేవెగౌడ లోక్ సభ ఎన్నికలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తాను బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి తన మనవడు ప్రజ్వల్ హాసన్ నుంచి మరో మనవడు నిఖిల్ ను మాండ్యానుంచి బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. ఈ మూడు స్థానాల్లో బెంగళూరు ఉత్తర నియోజకవర్గం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదు.
శక్తికి మించి కోరుతున్నారని…..
మొత్తం 28 స్థానాలున్న కర్ణాటకలో దేవెగౌడ పార్టీ పది నుంచి 12 స్థానాలను కోరుకుంటుంది. వాస్తవ పరిస్థితులను, గత శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లోనూ, జనతాదళ్ ఎస్ ఐదు స్థానాల్లోనూ గెలుపుకు అవకాశాలున్నాయి. అయితే జనతాదళ్ ఎస్ తన శక్తికి మించి సీట్లను కోరుతుండటం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. ఇక్కడి నేతలతో అయ్యే పనికాదని దేవెగౌడ హస్తినలో హస్తం పార్టీ పెద్దలతో సీట్ల విషయమై చర్చలు ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలే జేడీఎస్ కు ఎక్కువ స్థానాలను ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. ముఖ్యంగా కుమారస్వామి పాలన పట్ల కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తోంది.
కలసికట్టుగా పనిచేస్తారా?
ఈ నేపథ్యంలో కలసి కట్టుగా నేతలు, క్యాడర్ పనిచేయాలంటే ముందు అగ్రనేతలందరూ ఒక్కటవ్వాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు ఇచ్చే సీట్ల విషయమై ఆపార్టీకి సంకేతాలు పంపింది. హాసన్, మైసూరు, మాండ్య, రామనగర, చామరాజనగర, తుమకూరు స్థానాలను జేడీఎస్ కు వదిలేయాలని నిర్ణయించింది. మిగిలిన సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నారు. ఇటీవల కుమారస్వామి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ఆరు స్థానాలతో పాటు దేవెగౌడ కోరిక మేరకు బెంగళూరు ఉత్తర నియోజకవర్గాన్ని వదిలే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు మించి సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదంటున్నారు హస్తం పార్టీ నేతలు. మరి జేడీఎస్ అందుకు అంగీకరిస్తుందో? లేదో? చూడాల్సి ఉంది.