ఎవరికెవరు ఈ పార్టీలో ఎవరికి ఎరుక?

ఆపదలో ఉన్నప్పుడే స్నేహితులనే వారు అక్కరకు వస్తారు. అలాగే కష్టసమయాల్లో శత్రువులుగా ఉన్న వారు సయితం మిత్రులుగా మారతారు. ఎంత బద్ధ విరోధి అయినా సమస్యల్లో చిక్కుకుకున్నప్పుడు [more]

Update: 2020-06-26 00:30 GMT

ఆపదలో ఉన్నప్పుడే స్నేహితులనే వారు అక్కరకు వస్తారు. అలాగే కష్టసమయాల్లో శత్రువులుగా ఉన్న వారు సయితం మిత్రులుగా మారతారు. ఎంత బద్ధ విరోధి అయినా సమస్యల్లో చిక్కుకుకున్నప్పుడు అండగా నిలవాలని ఆలోచిస్తారు. కానీ రాజకీయాల్లో మాత్రం అది సాధ్యం కాదమో. తమ శత్రువు ఇబ్బందుల్లో ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడమే రాజకీయం కాబోలు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై ఆ పార్టీ నేతల్లోనే ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతుంది.

జేసీ బ్రదర్స్ పై కేసు పెట్టినా….

జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి వారం గడుస్తుంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి విక్రయించిన కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంతకు ముందు రోజే అచ్చెన్నాయుడును కూడా ఈఎస్ఐ స్కామ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడుకు పార్టీ నుంచి వచ్చిన రెస్పాన్స్ జేసీ బ్రదర్స్ రాలేదు. జేసీ కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించడం మాత్రం వారికి కొంత ఊరటనిచ్చే అంశమే.

రాష్ట్రంలో పార్టీ నుంచి…..

అయితే రాష్ట్రంలో ఎవరూ జేసీ బ్రదర్స్ ను వెనకేసుకు రాలేదు. పార్టీలో ఉన్న రాష్ట్రస్థాయి నేతలు ఎవరూ జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అక్రమమని ముందుకు రాలేదు. అచ్చెన్నాయుడు విషయంలో వచ్చిన దూకుడుగా జేసీ బ్రదర్స్ విషయంలో రాలేదు. ఇందుకు ప్రధాన కారణం జేసీ బ్రదర్స్ నోటి దురుసు తనం అందరికీ తెలిసిందే. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనేేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.

ఎవరితో పడదు…

మరోవైపు అనంతపురం జిల్లా నేతలు సయితం జేసీ బ్రదర్స్ విషయంలో మొఖం చాటేశారు. లోకేష్ అనంతపురానికి వచ్చినప్పుడు కూడా వాళ్లు రాలేదు. జేసీ దివాకర్ రెడ్డికి జిల్లాలోని ఏ టీడీపీ నేతతోనూ సరిపడదు. నోరేసుకుని పడిపోతారన్న పేరుంది. అధికారంలో ఉన్నప్పుడే అనేక మంది ఎమ్మెల్యేలతో పడేది కాదు. చంద్రబాబు కూడా జేసీ నోటికి జడిసి ఏమీ అనేవారు కాదు. దీంతో జేసీ బ్రదర్స్ పై అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కనీసం పరామర్శించేందుకు ముందుకు రాకపోవడం విశేషం.

Tags:    

Similar News