Jc brothers : బాబు కాల్ కోసమే వెయిటింగా?

జేసీ బ్రదర్స్ కామ్ అయ్యారు. వారి మౌనం తగ్గారనుకోవాలా? లేక సమయం కోసం వేచి చూస్తున్నారనుకోవాలా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జేసీ బ్రదర్స్ మామూలుగా తగ్గరు. వాళ్లు [more]

Update: 2021-10-11 06:30 GMT

జేసీ బ్రదర్స్ కామ్ అయ్యారు. వారి మౌనం తగ్గారనుకోవాలా? లేక సమయం కోసం వేచి చూస్తున్నారనుకోవాలా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జేసీ బ్రదర్స్ మామూలుగా తగ్గరు. వాళ్లు తమ ఇలాకాలో తమదే ఆధిపత్యం కొనసాగాలని బలంగా కోరుకుంటారు. తాము ఉన్న పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయడం వారికి అలవాటే. అటువంటిది అచ్చెన్నాయుడు వార్నింగ్ తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది అంతుపట్టకుండా ఉంది.

అచ్చెన్న వార్నింగ్ తో….

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధరెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు పార్టీని జిల్లాలో ముంచేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఆయన నేరుగా పుట్టపర్తి వెళ్లి నియోజకవర్గంలో కార్యకర్తలను పరామర్శించారు. తనను నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటే టీడీపీ రెండో కార్యాలయాన్ని ప్రారంభిస్తానని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

అచ్చెన్న వార్నింగ్ తో….

దీని తర్వాత అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పేరుకు అచ్చెన్నాయుడు ఈ ప్రకటన చేసినా చంద్రబాబు అనుమతి ఉందన్నది అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. ప్రధానంగా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు వారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి తోడు అనంతపురం పార్లమెంటు పరిధిలో జేసీ వర్గానికి చోటు లేకుండా నియామకాలు జరిగాయి.

బాబు వద్దనే….

ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ పరిధిలో కార్యక్రమం చేసినా పార్టీ రహితంగానే చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు తనను పిలిచి వివరణ ఇస్తే తప్ప ముందుకు వెళ్లకూడదని భావిస్తున్నారు. చంద్రబాబు పిలుపు కోసం జేసీ బ్రదర్స్ ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News