జేసీలను దువ్వుతున్నారా..?
వైసీపీ అధినేత జగన్.. రాజకీయం చిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని పలుచన చేసేందుకు ఆయన వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీలో ఇప్పటికే వాయిస్ వినిపించేవారికి [more]
వైసీపీ అధినేత జగన్.. రాజకీయం చిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని పలుచన చేసేందుకు ఆయన వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీలో ఇప్పటికే వాయిస్ వినిపించేవారికి [more]
వైసీపీ అధినేత జగన్.. రాజకీయం చిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని పలుచన చేసేందుకు ఆయన వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీలో ఇప్పటికే వాయిస్ వినిపించేవారికి బలమైన వార్నింగ్ (అరెస్టులతో) ఇచ్చిన జగన్ సర్కారు.. కొందరి విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. అంటే.. అరెస్టు చేయడం ద్వారా.. ప్రజల్లో సింపతీని తగ్గించి.. తన పార్టీని బలోపేతం చేసుకోవడమనే రాజకీయ వ్యూహంలో కొన్ని కొన్ని జిల్లాల్లో పార్టీ తిప్పలు పడుతోంది. దీనిని గమనించిన జగన్.. మరో వ్యూహానికి తెరదీశారు.
నాలుగు దశాబ్దాలు….
ఉదాహరణకు అనంతపురం రాజకీయాలను తీసుకుంటే.. తాడిపత్రిలో జేసీ దివాకర్, ప్రభాకర్ రెడ్డిల రాజకీయాలకు తిరుగులేదు. దాదాపు 40 ఏళ్లు ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. గత ఏడాది మాత్రమే ఓడిపోయారు. అయితే.. మళ్లీ పుంజుకుంటుండడం గమనార్హం. కానీ, వాస్తవానికి ఇక్కడ జేసీ వర్గాన్ని నామరూపాలు లేకుండా చేసేద్దామని.. జగన్ భావించారు. ఈ క్రమంలోనే రవాణా శాఖను మోసం చేశారనే కేసులపై జేసీ ప్రభాకర్‌ను అరెస్టు చేయడం, ఆయన కుమారుడితో పాటు.. ఆయనను కూడా జైలుకు పంపించడం తెలిసిందే.
మున్సిపల్ ఎన్నికల్లో….
అయితే.. తర్వాత జరిగిన స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌కు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. బొటా బొటీ మెజారిటీనే వచ్చినప్పటికీ.. ఆయన బలానికి తిరుగులేదనే సంకేతాలు వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ ఓ ఇద్దరు కౌన్సిలర్లను వైసీపీ లాగేసుకుని ఉంటే.. మరో విధంగా ఉండేది. కానీ, జగన్ ఇక్కడే బుర్ర వినియోగించారు. ఇలా చేసి.. మరో గొయ్యి తవ్వుకోవడం ఎందుకు? అనుకున్నట్టున్నారు. ఇక్కడ వైసీపీ నేతలను సైలెంట్ చేసేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ అయ్యారు.
తనకు సహకరించేలా…?
ఇక్కడే ఉంది .. అసలు లాజిక్ అంతా! ఆ వెంటనే.. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు సహకరించబట్టే.. తాను కౌన్సిల్ చైర్మన్ అయ్యాయని ప్రకటించారు. అంటే..రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ సహకరిస్తే.. తన కుమారుడు ఎమ్మెల్యే అవడం ఖాయమనే విషయాన్ని ఆయన పైకి చెప్పకపోయి నా.. దాదాపు మనసులో మాట పరోక్షంగా బయట పెట్టారు. ఇక, వైసీపీ కూడా .. ఇక్కడ మళ్లీ కేతిరెడ్డి గెలిచే ఛాన్స్ లేదని.. ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే.. ఉభయ కుశలోపరిగా.. జేసీకి మనం సహకరిస్తే.. రేపు జేసీ మనకు సహకరించడం ఖాయమని.. టీడీపీ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గంలో పాగా వేయడం మళ్లీ ఖాయమని అనుకుంటున్నారట. సో.. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి జేసీని వైసీపీలోకి తీసుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. అంటున్నారు పరిశీలకులు.