జేసీ వాళ్లను రానివ్వరట
టీడీపీకి కంచుకోట వంటి జిల్లా అనంతపురంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ఏం జరుగుతోంది ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. దీనికి ప్రధాన [more]
టీడీపీకి కంచుకోట వంటి జిల్లా అనంతపురంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ఏం జరుగుతోంది ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. దీనికి ప్రధాన [more]
టీడీపీకి కంచుకోట వంటి జిల్లా అనంతపురంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ఏం జరుగుతోంది ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోవడమే. ఎక్కడికక్కడ నాయకుల మధ్య కీచులాటలు.. కలిసి రాని రాజకీయాలు మొత్తంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీని తీవ్రంగా ఇబ్బందికి గురి చేశాయి. హిందూపురం, ఉరవకొండ మినహా ఎక్కడా పార్టీ విజయం సాధించింది లేదు. అదే సమయంలో కీలకమైన శింగనమలలో తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. ఇక్క డ నుంచి కాంగ్రెస్ అనేకసార్లు, టీడీపీ పలుమార్లు విజయం సాధించాయి.
జేసీకి ప్రత్యేక వర్గం….
ముఖ్యంగా గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరగక ముందు ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి వర్గం బలంగా ఉండేది. జేసీ పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రాంతాలు అన్ని ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా రాజకీయాలు సాగాయి. ఆ తర్వాత టీడీపీ సీనియర్ నేతగా ఉన్న శమంతకమణి ఇక్కడ ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఇక, వైఎస్ హయాంలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంది. సాకే శైలజానాథ్ క్కడ కాంగ్రెస్ తరఫున వరుస విజయాలను కైవసం చేసుకున్నారు. రెండు సార్లు గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.
ఎవరు అండగా నిలిస్తే….
ఈ నేపథ్యంలో మళ్లీ ఇక్కడ 2014లో టీడీపీ పుంజుకుంది. ఇక్కడ నుంచి శమంతకమణి కుమార్తె యామినీ బాల విజయం సాధించారు. ఎవరు తమకు అండగా నిలుస్తారో వారికి పట్టంకట్టే నియోజకవర్గంగా ఇది గుర్తింపు సాధించింది. దీంతో ఏ పార్టీ కూడా ఇక్కడ తిష్టవేసిన పరిస్థితి లేదు. అయితే, ఇప్పుడు టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని లైన్‌లో పెట్టే చర్యలు ఏ ఒక్కరూ తీసుకోకపోవడం గమనార్హం. పైగా జేసీ వర్గం ఇక్కడ తమ హవాను తిరిగి చూపించాలని ప్రయత్నించడం మరింతగా పార్టీలో చర్చకు దారితీస్తోంది.
వారిని కాదని….
జిల్లాపై పెత్తనం కోసం ఎప్పుడూ పాకులాడే జేసీ అటు తమ సొంత నియోజకవర్గం అయిన తాడిపత్రితో పాటు అనంతపురం అర్బన్, గుంతకల్, శింగనమల ఇలా ప్రతిచోటా వేలుపెట్టేస్తున్నారు. శింగనమలలో గత ఎన్నికల్లో జేసీ పట్టుబట్టడంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామినీ బాలను కాదని బాబు జేసీ చెప్పిన బండారు శ్రావణికి సీటు ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె రాజకీయాలకు దూరం అయ్యారు. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వస్తున్నా ఆమెను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితే లేదు.
ససేమిరా అంటున్న…..
ఇక తల్లికూతుళ్లు అయిన శమంతక మణి, మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ యామినీ బాల విషయంలో కుటుంబ కలహాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. వారిద్దరు వేర్వేరు వర్గాలు ప్రోత్సహిస్తూ మళ్లీ శింగనమలలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు జేసీ దివాకర్ రెడ్డి వర్గం మాత్రం వీళ్లను మళ్లీ అక్కడ ఎంటర్ కానియ్యమని చెబుతోంది. ఈ నేపథ్యంలో శింగమనల టీడీపీ రాజకీయం ఏ తీరానికి చేరుతుందో ? చూడాలి.