టైమింగ్ చూసుకుని రావాలనేనా?

రాష్ట్రంలో ఎవరికీ అర్థం కాని విషయం ఒక్క జేసీ బ్రదర్స్ కే అర్థమయింది. పోరాడితే జైలుకే తప్ప మిగిలేదేమీ లేదని వారికి స్పష్టంగా తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు [more]

Update: 2020-03-16 13:30 GMT

రాష్ట్రంలో ఎవరికీ అర్థం కాని విషయం ఒక్క జేసీ బ్రదర్స్ కే అర్థమయింది. పోరాడితే జైలుకే తప్ప మిగిలేదేమీ లేదని వారికి స్పష్టంగా తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు తాము జగన్ పట్ల వ్యవహరించిన తీరును కూడా వారు గుర్తుకు చేసుకుంటున్నారు. అందుకే అన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతే భయపడ్డారంటే మిగిలిని వారి మాటేంటన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. జేసీ సోదరులిద్దరూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.

పోటీ చేయనంటూ…

పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడో ప్రకటించారు. గెలిచినా కేసులు పెట్టి బొక్కలో వేస్తారని, దీనివల్ల ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు. ఇప్పటికే జేసీ బ్రదర్స్ ను వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతోంది. వారి ఆర్థిక మూలాలపై దారుణంగా దెబ్బకొట్టింది. ఇక అనేక కేసులు జేసీ బ్రదర్స్ మెడపై వేలాడుతున్నాయి. జేసీ బ్రదర్స్ కు చెందిన బస్సులన్నింటినీ దాదాపు సీజ్ చేశారు. అలాగే తుక్కు ఇనుము లారీల అమ్మకంపై కూడా కేసులు నమోదయి ఉన్నాయి.

కేసుల భయంతోనేనా?

ిఇవన్నీ చూసూ జేసీ దివాకర్ రెడ్డి ఈ ఎన్నికలు మాకొద్దు బాబోయ్ అంటే చేతులెత్తేశారు. ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుందని జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నారు. తమ వారసులకు కూడా ఇదే హితబోధ చేస్తున్నారు. దూకుడుగా వెళ్లవద్దని, వీలయితే హైదరాబాద్ , బెంగళూరు లోనే ఎక్కువగా ఉండాలని వారికి చెబుతున్నారు. ఈ నాలుగేళ్లు వ్యాపారాలు మాత్రమే చూసుకోవాలని వారసులకు కూడా జేసీ దివాకర్ రెడ్డి నిర్దేశించినట్లు చెబుతున్నారు. రాజకీయాలను అస్సలు పట్టించుకోవద్దని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది.

ఎన్నికల సమయానికి…..

ఎన్నికల సమయానికి అప్పటి పరిస్థితులను బట్టి జేసీ దివాకర్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశముంది. తమ కుటుంబం ప్రమేయం లేకుండా తాడిపత్రిలో ఎన్నికలు జరగవని ఆయనకు తెలియంది కాదు. అందుకే ఎన్నికల సమయానికి వస్తే ఈ కేసుల బాధ ఉండదని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఏ పార్టీలో చేరే ఉద్దేశ్యం కూడా తనకు లేదని చెబుతున్నారు. టీడీపీలోనే ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉండాలని జేసీ ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News